వర్తే వర్మా.. ఫుల్ వర్తు..!

Shreyas Iyer: Full Worthy Player

గతేడాది జరిగిన ఐపీఎల్ ఆక్షన్ లో పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం భారత మిడిల్-ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ను ఏకంగా 26 .75 కోట్లకు కొనుగోలు చేసిన విషయం అందరికి తెలిసిందే.

అయితే, అది జరిగినప్పుడు పంజాబ్ యాజమాన్యం పై మిక్సెడ్ ఒపీనియన్ వచ్చింది. ఒక్క ఆటగాడి పై అంత ఖర్చు పెట్టటం టీం కు బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాదన గట్టిగా వినిపించింది.

ADVERTISEMENT

అయితే, తన ఆక్షన్ పై వచ్చిన విమర్శలకు బదులిచ్చే విధంగా సీజన్ మొదటి మ్యాచ్ నుండే శ్రేయాస్ అయ్యర్ లో ఒక కొత్త కోణాన్ని చూపించాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ లో తన జట్టును విజేతగా నిలిపినప్పటికీ శ్రేయాస్ అయ్యర్ ను కేకేఆర్ యాజమాన్యం వదులుకుంది.

అలాగే ఆ విజయానికి తగ్గ తగినంత గుర్తింపు, గౌరవం కూడా శ్రేయాస్ కు దక్కలేదనే చెప్పాలి. అలా మొదలైన సీజన్ 18 శ్రేయాస్ ప్రస్థానం ఐపీఎల్ చరిత్ర లో నే రెండవ హైయెస్ట్ ధర ను అందుకున్న ఆటగాడిగా రికార్డు సాధించాడు.

ఇక, సీజన్ మొదటి మ్యాచ్ నుండే అటు కెప్టెన్సీ లో, ఇటు బ్యాటింగ్ లో.. రెండిట్లోనూ అదిరిపోయే ఆటతీరు కనపరుస్తూ, తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ను సృష్టించుకుని, పంజాబ్ జట్టును విజయ బాటలో నడిపిస్తూ ముందకు సాగాడు.

లీగ్ స్టేజి పూర్తయ్యే సరికి తన జట్టును పాయింట్ల పట్టిక లో మొదటి స్థానం లో నిలిపి, క్వాలిఫయర్ -1 కు అర్హత సాధించాడు. క్వాలిఫయర్ లో ఓటమి చెందినప్పటికీ, తాము కేవలం పోరు లో ఓడాము కానీ యుద్ధం లో ఓడలేదు అంటూ ఘాటైన వాఖ్యాలు వెల్లడించి, క్వాలిఫయర్-2 లో ముంబై ఇండియన్స్ జట్టు పై బ్యాట్ తో ఊచ కోత కోసి, తన పై పంజాబ్ జట్టు పెట్టిన ప్రతి రుపాయికి న్యాయం చేసారు అయ్యర్.

అలాగే తన కెప్టెన్సీ తో పంజాబ్ జట్టును 11 ఏళ్ళ తరువాత ఫైనల్ కు పట్టుకెళ్ళాడు అయ్యర్. మరి అయ్యర్ ఈ సీజన్ కూడా ట్రోఫీ ను గెలిచి, వరుసగా రెండు ట్రోఫీలను అందుకున్న రెండవ కెప్టెన్ గా నిలవగలడా..? ఆర్సీబీ 18 ఏళ్ళ నిరీక్షణ ను అడ్డుకోగలరా.?

ADVERTISEMENT
Latest Stories