బిగ్ బాస్ లోకి ఎంటర్ అవుతోన్న టాప్ హీరోయిన్!

Shruti-Haasanప్రదర్శితం అవుతోన్న అన్ని భాషలలో దిగ్విజయంగా కొనసాగుతోన్న బిగ్ బాస్ షోలోకి టాప్ హీరోయిన్ శృతిహాసన్ ఎంటర్ కాబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో సినిమా చేస్తోన్న శృతి, ప్రస్తుతం మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగంకు పైగా పూర్తయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తోంది.

ప్రస్తుతం ప్రదర్శితమవుతోన్న బిగ్ బాస్ హౌస్ లోకి శృతి ఎంటర్ అవుతోందని ఖరారయ్యింది. అయితే హౌస్ లో గేమ్ ఆడేందుకు కాదులేండి! తన తండ్రి కమల్ హాసన్ నటించిన “విశ్వరూపం 2” సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల కాబోతున్న నేపధ్యంలో, దీని ప్రచారానికి గాను అడుగు పెడుతోంది. సంగీత దర్శకుడు జిబ్రాన్ తో హౌస్ లో సందడి చేయనుంది ఈ ముద్దుగుమ్మ.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories