అప్పుడు వదిలారు… ఇప్పుడు పీకేసారు..!

Setback Shruti Haasan Before Start For Next Baahubali - Sanghamitraకొన్ని రోజుల క్రితం జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో “సంఘమిత్ర” సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. టైటిల్ రోల్ లో శృతిహాసన్ నటిస్తుండగా, ఆర్య, జయం రవి ఇతర పాత్రల్లో నటించబోతున్నారు. దాదాపుగా 450 కోట్ల బడ్జెట్ తో “బాహుబలి, రోబో” సినిమాలకు ధీటుగా దీనిని తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు సుందర్.సి నిమగ్నమయ్యారు. అయితే ఇంతలోనే ఏం జరిగిందో ఏమో గానీ, ఈ సినిమా నుండి హీరోయిన్ శృతిహాసన్ ను తప్పిస్తున్నట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది.

తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషలలో కూడా నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమా కోసం శృతిహాసన్ ప్రత్యేకంగా కసరత్తులు కూడా చేసింది. దీనికి సంబంధించి శృతిహాసన్ కత్తి తిప్పే విన్యాసాల వీడియో కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి ఇంతలా కష్టపడిన శృతిహాసన్ ఉన్నట్లుండి తప్పుకోవడానికి గల కారణాలు ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది. ‘ఆదిలోనే హంసపాదు’లా, టైటిల్ రోల్ పోషించే శృతిహాసన్ మార్పు, చిత్ర యూనిట్ సభ్యులలో ఎలాంటి సంకేతాలను పంపిస్తుందో చూడాలి.

ADVERTISEMENT

అయితే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత జరిగిన సంఘటనలతోనే శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ నుండి వచ్చిన ప్రకటనను శృతిహాసన్ అయితే ఇంకా ధృవీకరించలేదు. శృతి ముఖకవళికలలో ఇటీవల చాలా మార్పులు చోటు చేసుకున్నాయని, మునుపటిలా చూడడానికి అంత ఆకర్షణీయంగా శృతి కనిపించడం లేదన్న విమర్శలైతే, ఇటీవల కాలంలో చాలానే వినపడుతున్నాయి. పవన్ ‘కాటమరాయుడు’ సినిమా సందర్భంలో కూడా ఈ వ్యాఖ్యలు బాగా హల్చల్ చేసాయి.

ADVERTISEMENT
Latest Stories