ఈ హీరోను తెలుగు ప్రేక్షకులు కనికరిస్తారా?

Siddharth Gruham Release Date ఇప్పటికే రెండు సినీ ఇండస్ట్రీల ప్రేక్షకుల చేత మెప్పులు పొందిన సిద్ధార్ద్ “గృహం” సినిమా, ఎట్టకేలకు ఈ నెల 17వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి రెండు వారాల క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా, దియేటర్ల లభ్యతతో వాయిదాలు పడుతూ వస్తోంది. గత వారం విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ఈ వారం కూడా మూడు, నాలుగు సినిమాలు విడుదల కావడంతో, చివరి నిముషంలో సిద్ధార్ద్ వెనక్కి వెళ్ళాడు. ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించిన సిద్ధార్ద్, ఎలాగైనా “గృహం” ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు మరోసారి దగ్గర కావాలని ఈ శుక్రవారం నాడు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడు.

ADVERTISEMENT

తమిళం, హిందీ భాషలలో ఈ సినిమా విడుదలై, ఇప్పటికీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలే కాకుండా, ప్రేక్షకుల మౌత్ టాక్ పరంగా కూడా “గృహం” సినిమా సక్సెస్ సాధించింది. సిద్ధార్ద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆండ్రియా ఓ కీలకపాత్రను పోషించింది. నటుడిగానే కాక, నిర్మాతగా కూడా వ్యవహరించిన సిద్ధార్ద్ కు రెండు ‘వుడ్’ ప్రేక్షకులు ఆశీర్వాదాలు అందించగా, తెలుగు ప్రేక్షకులు ఏ విధమైన తీర్పును అందిస్తారో చూడాలి. గతంలో ‘నువ్వొస్తానంటే నేనోద్దంటానా’ వంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సిద్ధార్ద్ మాత్రం, తెలుగు ప్రేక్షకుల పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories