ఒకప్పుడు సమ్మర్ వస్తుందంటే వారానికో పెద్ద సినిమా విడుదలకు సిద్ధంగా ఉండేవి, విజయాలు కూడా ఆ స్థాయిలోనే ఉండేవి. సంక్రాంతి సీజన్ తర్వాత సమ్మర్ అనేది టాలీవుడ్ కు ఇచ్చే అతి పెద్ద కిక్. అయితే ఈ సారి మాత్రం “టిల్లు స్క్వేర్”తో సిద్ధూ జొన్నలగడ్డ ఆఖరి కిక్ ఇచ్చినట్లుగా కనపడుతోంది.
100 కోట్లు కొల్లగొట్టి ఇంకా ధియేటర్లలో సందడి చేస్తోన్న “టిల్లు స్క్వేర్” తర్వాత సమ్మర్ టాలీవుడ్ అత్యంత నిరాశాజనకంగా మారనుంది. ఈ సారైనా బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ చూపిస్తాడనుకున్న విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” సైలెంట్ అయిపోవడంతో ప్రేక్షకులు కూడా నిరాశ చెందాల్సిన పరిస్థితి.
Also Read – జగన్ లక్కీ ఆర్ అన్ లక్కీ..?
మే 30న “కల్కి” విడుదల అవుతోందని ప్రస్తుతం వార్తలు వినపడుతున్నాయి, అలాగే జూన్ 20వ తేదీ కూడా మరో ప్రత్యామ్నాయ తేదీ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. నేటితో షూటింగ్ ముగించుకుని ‘శుభంకార్డు’ పడినప్పటికీ, విడుదల విషయంలో ఇంకా “కల్కి” గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
“కల్కి” విడుదలయ్యే వరకు ధియేటర్ల వద్ద భారీ సంఖ్యలో ప్రేక్షకులు క్యూ కట్టడానికి సరైన సినిమా లేకపోవడం ఈ సమ్మర్ చప్పగా మిగలనుంది. ఓ పక్కన ఎన్నికలు, మరో పక్కన ఐపీఎల్ మ్యాచ్ ల వినోదం ముందు ధియేటర్ వినోదం పండుతుందో లేదో అన్న భావన కూడా నిర్మాతల వెనుకడుగుకు ఓ కారణంగా కనపడుతోంది.
Also Read – బీసీల పరిస్థితి మారలేదు కానీ.. కృష్ణయ్యది మారిందిగా!