‘శాతకర్ణి’ చరిత్రను వక్రీకరించలేదు – సిరివెన్నెల!

Sirivennela Seetharama Sastry clarifies on Gautamiputra Satakarni Storyఅతి త‌క్కువ చారిత్రక ఆధారాలు ఉన్న క‌థ శాత‌క‌ర్ణి అని.., క్రిష్ క‌ల బాల‌కృష్ణ ద్వారా ప్ర‌పంచం చూస్తోందని.., బాల‌కృష్ణ‌ అద్భుతమైన న‌ట‌న‌ను క‌న‌బ‌ర్చార‌ని.., శాత‌క‌ర్ణిని తెలుగు వారికి మ‌రోసారి గుర్తు చేశార‌ని… చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను క్రిష్ తీశారే తప్ప… చరిత్రను వక్రీకరించి కాదని సిరివెన్నెల సీతారామశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేసారు.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా విడుదలై విజయవంతం అయిన తర్వాత… శాతకర్ణి చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించారు… స‌క్రీక‌రించారు… అని ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అది స‌రికాద‌ని, తాను ఈ సినిమాకి పాట‌లు రాయాల్సి వ‌చ్చినప్పుడు విశ్వ‌నాథ‌ స‌త్య‌నారాయ‌ణ ర‌చించిన‌ ఆంధ్ర‌ప్ర‌శ‌స్తిని చ‌దివాన‌ని, శాత‌క‌ర్ణి గురించి అందులో ఉంద‌ని సిరివెన్నెల తెలిపారు.

ADVERTISEMENT

చ‌క్ర‌వ‌ర్తులంద‌రిలో మిన్న‌యిన‌ చ‌క్ర‌వర్తి శాత‌క‌ర్ణి అని అందులో ఉంద‌ని, ఒక శ‌కానికి ఆరంభ‌కడుగా పిల‌వ‌ద‌గిన వ్య‌క్తి శాత‌క‌ర్ణి అని, ఈ సినిమా ఆర్థిక‌మైన విజ‌యం సాధిస్తోంద‌ని, చారిత్ర‌కమైన విజ‌యం సాధించిన సినిమాగా కూడా నిలుస్తుంద‌ని అన్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌ను తండ్రిని మించిన త‌న‌యుడు అంటే బాగుంటుందని ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అభిప్రాయ పడ్డారు.

ADVERTISEMENT
Latest Stories