ఈ 2025 వ సంవత్సరం లో క్రీడాభిమానులు ఇప్పట్లో చూడలేమేమో అనుకున్న ఎన్నో దృశ్యాలు, మరియు ఘటనలు చూసాము. ఈ సెంటిమెంట్ ఫుట్-బాల్ తో మొదలయ్యి క్రికెట్ తో కొనసాగింపబడి, ఇప్పుడు బాస్కెట్-బాల్ ను కూడా తాకింది.
తాజాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ లో ఎట్టకేలకు తమ 18 ఏళ్ళ కప్పు కరువు ను ముగించాక, ఈ టాపిక్ ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఫుట్-బాల్ లో పీ.ఎస్.జీ క్లబ్ మే 31 న తమ చరిత్ర లో మొట్ట మొదటి సారి యు.ఈ.ఎఫ్.ఏ టైటిల్ ను అందుకున్నారు. దీనితో ఆ కప్ ను అందుకున్న తొలి ఫ్రెంచ్ క్లబ్ గా చరిత్ర పుస్తకాలకెక్కారు.
‘గో ఎహెడ్ ఈగల్స్’ అనే డచ్ క్లబ్, ఈ ఏడాది కె.ఎన్.వీ.బీ కప్పును అందుకుని, తమ 92 ఏళ్ళ కళను నెరవేర్చుకున్నారు. క్రిస్టల్ పాలస్ క్లబ్ మే 17 న ఎఫ్.ఏ కప్పును అందుకుని తమ ఆ క్లబ్ ను ఏర్పరిచిన 119 ఏళ్ళ తరువాత తొలిసారి కప్పును సొంతం చేసుకున్నారు.
ఇటు బాస్కెట్-బాల్ లో చూస్కుంటే, నిన్ననే మొదలయిన ఎన్.బీ.ఏ ఫైనల్స్ కు అర్హత సాధించిన రెండు క్లబ్ లు తమ మొదటి టైటిల్ ను అందుకోవాలని తపిస్తున్నాయి. కనుక, విజేతలు ఎవరైనప్పటికీ, 2025 ఎన్.బీ.ఏ ఒక కొత్త ఛాంపియన్ క్లబ్ ను చూడబోతుంది. ఇరువురిలో పై చేయి సాధించిన జట్టు చరిత్ర లో మొదటిసారి లారి ఓ’ బ్రెయిన్ ట్రోఫీ ను అందుకోనున్నారు.
ఇక, క్రికెట్ లో చూస్కుంటే, మొదటిగా ఆస్ట్రేలియన్ లీగ్ అయిన ‘బిగ్ బాష్’ లో ‘హోబార్త్ హరికెన్స్’ జట్టు బీ.బీ.ఎల్ చరిత్రలోనే మొదటి సారి ట్రోఫీ ను అందుకున్నారు. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలలకే, వరల్డ్ ఫెమస్ టి-20 లీగ్ ‘ఐపీఎల్’ లో ఎప్పుడు ఈ శాల కప్ నందే అంటూ హడావిడి చేసే ‘ఆర్.సి.బీ’ తమ మొదటి ట్రోఫీ ను అందుకుని ఈ శాల కప్ నందు అంటూ ముగించారు.
ఇదే వరుస లో, మరి కొన్ని రోజులలో, ఆసీస్ మరియు సఫారీలు (ఆఫ్రికా) టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం ఫైనల్ ఆడనున్నారు. మరి, ఇప్పటికే అనేకసార్లు ప్లే-ఆఫ్స్ వరకు వచ్చినా, సౌత్ ఆఫ్రికా జట్టు కీలక మ్యాచ్ లలో అనూహ్యంగా, ఎవ్వరికి అంతుపట్టని విధంగా చోక్ చేసి, ఎన్నో నాక్-అవుట్ మ్యాచ్లలో ఓడారు. మరి కనీసం ఈసారైనా ఈ చోకర్స్ ఛాంపియన్స్ గా అవతరిస్తారా..?




