బాలీవుడ్ లోకి స్పైడర్… హక్కులు ఆయన చేతుల్లోకే..?

Spyder Hindi Distribution Rights - Karan Johar‘బాహుబలి 2’ సినిమాను బాలీవుడ్ లో డబ్ చేసి కోట్ల రూపాయలు బిజినెస్ చేసిన కరణ్ జోహార్ తెలివితేటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! ‘బాహుబలి 2’ ద్వారా అత్యధిక ఆదాయం లభించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే… అది కరణ్ జోహార్ అన్నది నిర్వివాదమైన అంశం. ‘బాహుబలి 2’ ప్రభావమో ఏమో గానీ, ప్రస్తుతం కరణ్ జోహార్ కన్ను మురుగదాస్ – మహేష్ బాబు “స్పైడర్” టీజర్ పైన కూడా పడిందని స్పష్టమైంది.

కాస్త ఆలస్యంగా అయినా ప్రిన్స్ మహేష్ బాబు “స్పైడర్” అదిరిందని, ఈ సినిమా చూడడానికి ఇంకా ఆగలేనంటూ… చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ‘బాలీవుడ్ 2’ మాదిరే ‘స్పైడర్’ను కూడా బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తారా? అన్న రీతిలో చర్చలు సాగుతున్నాయి. అదే జరిగితే ‘స్పైడర్’ చిత్ర యూనిట్ కు అంతకు మించిన పండగ మరొకటి ఉండదని చెప్పవచ్చు.

ADVERTISEMENT

కరణ్ జోహార్ పక్కా బిజినెస్ మెన్ అన్న విషయాన్ని ఇటీవల రాజమౌళి సైతం స్పష్టం చేసారు. ఎక్కడైనా తనకు లాభాలు వచ్చే ఆలోచనలు ఉంటే, అసలు వదిలిపెట్టరు అనే నానుడి కూడా ఉంది. మరి ‘స్పైడర్’ను కూడా బాలీవుడ్ లోకి పట్టుకుపోతారా? అంటే ఏమో చెప్పలేం… ప్రిన్స్ కు ఎలాగూ జాతీయ స్థాయిలో ఫేం ఉంది, మురుగదాస్ కు బాలీవుడ్ లో హిట్లున్నాయి… కాబట్టి ఏదైనా జరగొచ్చు అన్న టాక్ వినపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories