రోలర్ కోస్ట్ ఫైట్ సీక్రెట్ ఇదన్నమాట!

spyder-roller-coaster-ar-murugadossమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “స్పైడర్” సినిమాలో రోలర్ కోస్ట్ ఫైట్ అదిరిపోతుందనే టాక్ ప్రీ రిలీజ్ కు ముందు బాగా హల్చల్ చేసింది. అంత అంచనాలతో వెళ్ళిన ప్రేక్షకులకు ఈ ఫైట్ పూర్తి నిరాశను కలిగించింది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఈ ఫైట్ ను సరిగ్గా చిత్రీకరించడంలో చిత్ర యూనిట్ పూర్తిగా విఫలమైంది. అలాగే గ్రాఫిక్స్ కూడా పెద్ద సినిమా స్థాయిని తలపించలేకపోయాయి.

అయినప్పటికీ ఒక రిస్కీ ఫైట్ కావడంతో, ఈ సన్నివేశాలకు ప్రేక్షకులు ఓకే చెప్పారు. మరి ఇంత రిస్కీ ఫైట్ ఎలా చిత్రీకరించారు? అంటే దానికి సమాధానమే ఈ వీడియో. గ్రీన్ మ్యాట్ లో ఓ రోలర్ ను తీసుకువచ్చి దానిపై చిత్రీకరించిన రిస్కీ సన్నివేశాలను గ్రాఫిక్స్ తో సినిమాలో నిజమైన సీన్స్ గా పెట్టారు. అయితే ఈ గ్రాఫిక్స్ సరిగా సెట్ కాకపోవడమే ఇందులో హైలైట్. ‘స్పైడర్’ సినిమాను జనాలు ఎప్పుడో మరిచిపోయినప్పటికీ, రోలర్ కోస్ట్ ఫైట్ కు దక్కిన పబ్లిసిటీ రీత్యా ఈ సీన్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories