‘శ్రీకృష్ణుడు’గా ప్రిన్స్ మహేష్ బాబు?

Sri krishna ROle for Mahesh Babuరాజమౌళి పుణ్యమా అంటూ ‘మహాభారతం’ అనే పేరు ఇండియన్ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తోంది. తన డ్రీం ప్రాజెక్ట్ గా అభివర్ణించిన జక్కన్న, ఎప్పటికైనా ‘మహాభారతం’ను సిల్వర్ స్క్రీన్ పై చూపించి తీరుతానని స్పష్టం చేసారు. అయితే ఇంతలోనే మరో ‘మహాభారతం’ తెరపైకి వచ్చింది. ఓ (యుఏఈలో ఉన్న)ఎన్ఆర్ఐ దాదాపుగా 1000 కోట్ల బడ్జెట్ తో ఈ ‘మహాభారతం’ను తీస్తానని ప్రకటన చేయడం సంచలనమైంది. అంతేకాదు, దీనికి సంబంధించిన కీలక కాస్టింగ్ కూడా ప్రకటించారు.

ఈ ‘మహాభారతం’ సినిమాను భీముడు యాంగిల్ లో చెప్పబోతున్నామని, భీముడు పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నారని స్పష్టమైంది. ‘బాహుబలి 2’ మాదిరే ఇది కూడా రెండు పార్టులుగా నిర్మాణం అవుతుందని, మొదటి పార్ట్ 2020కి విడుదల కావచ్చని చెప్పారు. అయితే తాజాగా మరో సంచలనమైన వార్త ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో శ్రీకృష్ణుడు పాత్రలో ప్రిన్స్ మహేష్ బాబును గానీ, హృతిక్ రోషన్ ను గానీ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ప్రిన్స్ విషయంలో ఇది సాధ్యమయ్యే విషయమేనా?

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories