ఇది ఊహించని జలక్ గురూ!

Sri Lanka vs Zimbabwe  2017టీమిండియాను సొంతగడ్డపై ఓడించడం ఎంతటి కష్టమైన విషయమో, శ్రీలంకను కూడా వారి గడ్డపై మట్టి కరిపించడం ఏ దేశానికైనా సవాల్ లాంటిదే. టాప్ టీంల మాటేమిటో గానీ, పసికూనలు జింబాబ్వే మాత్రం రెండు సార్లు లంకేయులను బోల్తా కొట్టించింది. అయిదు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో శ్రీలంకకు షాక్ ఇవ్వగా, తాజాగా జరిగిన నాలుగవ వన్డేలో మరోసారి శ్రీలంకను ఓడించి, సిరీస్ ను 2-2తో సమం చేసింది. దీంతో చివరి వన్డేలో గెలిచిన జట్టుకే సిరీస్ వశం కానుంది.

ADVERTISEMENT

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 300 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్లు డిక్ వెల్లా 116, గుణతిలక 87 పరుగులతో సత్తా చాటగా, మాథ్యూస్ 42 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 35 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 208 పరుగులు చేసిన లంకేయులు, తదుపరి 90 బంతుల్లో 92 పరుగులు మాత్రమే 6 వికెట్లు కోల్పోయింది. దీంతో భారీ స్కోర్ సాధిస్తుందని వేసిన అంచనాలను తలక్రిందులు చేయడంలో జింబాబ్వే జట్టు విజయవంతం అయ్యింది.

మ్యాచ్ లో వరుణుడు ప్రత్యక్షం కావడంతో, జింబాబ్వే లక్ష్యాన్ని 31 ఓవర్లలో 219 పరుగులుగా నిర్దేశించగా, మరో 10 బంతులు మిగిలి ఉండగానే జట్టు లక్ష్యాన్ని అందుకుంది. మసకద్జా 28, మిరే 43, ముసకంద 30 పరుగులు చేయగా, 55 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో ఎర్విన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో శ్రీలంకకు నాలుగవ వన్డేలో ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. జింబాబ్వే ఇచ్చిన రెండు జలక్ లతో అయిదవ వన్డేలో ఫలితం అత్యంత ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT
Latest Stories