ఆ తర్వాత ఏం జరిగిందో దేవుడికే తెలుసు – శ్రీరెడ్డి!

Sri Reddy Allegations on Director Sundar C and senthil kumar‘తమిళ్ లీక్స్’ అంటూ కోలీవుడ్ బడా వర్గాలను కుదిపెస్తోన్న శ్రీరెడ్డి ఫేస్ బుక్ పేజి నుండి తాజాగా మరో బిగ్ షాట్ పేరు బయటకు వచ్చింది. ఖుష్బూ భర్తగానే కాకుండా ఆర్టిస్ట్ గా, దర్శకుడిగా పేరుగాంచిన సుందర్ సి పై ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. తమిళ సినిమా “అరణ్మనై” (తెలుగులో చంద్రకళ) షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గణేష్ తన నెంబర్ సంపాదించి అక్కడికి పిలిపించాడు.

షూటింగ్ స్పాట్ లో దర్శకుడు సుందర్ సి కి తనకు పరిచయం చేయగా, ఆయన తదుపరి చిత్రంలో మెయిన్ లీడ్ గా అవకాశం వస్తుందని అక్కడే ఉన్న తన స్నేహితుడు, కెమెరామెన్ అయిన షెంతిల్ కుమార్ కన్విన్స్ చేసారని, ఆ తర్వాత రోజు సుందర్ సి తనను నోవోటేల్ హోటల్ కు పిలిపించి, సెక్సువల్ గా కంప్రమైజ్ కావాలని చెప్పారని, ఆ తర్వాత ఏం జరిగిందో ఆ పెరుమాళ్ కే తెలుసు అంటూ పోస్ట్ చేసింది.

ADVERTISEMENT

ఫైనల్ గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన గణేష్ మోసకారి అని తేలింది, తనకు ఎలాంటి సహాయం చేయలేదు అని ఆరోపించింది. అంతకుముందు తెలుగు, తమిళాలలో సినిమాలు చేస్తోన్న సందీప్ కిషన్ (చోటా కే నాయుడు మేనల్లుడు)పై కూడా సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. అయితే ఈ ఫేస్ బుక్ పోస్టింగ్ లు కేవలం సంచలనంగా నిలవడం తప్ప, ఎలాంటి ఉపయోగం కలుగడం లేదు. వీటిని ట్రేడ్ వర్గాలు కూడా అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు.

ADVERTISEMENT
Latest Stories