పిక్ టాక్ : జూనియర్ ఫ్యామిలీ హీరో!

Srikanth with son roshanకుటుంబ కధా చిత్రాల కధానాయకుడిగా ఒకానొక సమయంలో శ్రీకాంత్ పేరు టాలీవుడ్ లో మారుమ్రోగింది. అగ్ర కధానాయకుల స్థాయికి చేరకపోయినా, వారి కంటే ఎక్కువగా బిజీగా ఉంటూ, ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలలో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ అడపా దడపా సినిమాలు చేస్తున్న శ్రీకాంత్, హీరోగా తన కెరీర్ చివరి స్థాయికి చేరుకున్నాడు. శ్రీకాంత్ వదిలి వెళ్ళిన ఫ్యామిలీ హీరో స్థానం ఇప్పటికీ ఖాళీగానే ఉంది.

ADVERTISEMENT

బహుశా ఆ స్థానాన్ని తన కొడుకు రోషన్ చేత పూర్తి చేయించాలనుకుంటున్నారో ఏమో గానీ, తండ్రికొడుకులిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు శ్రీకాంత్. తండ్రి మాదిరే కూల్ లుక్ లో జూనియర్ ఫ్యామిలీ హీరో దర్శనమిస్తున్నాడు. ‘నిర్మల కాన్వెంట్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం కాబోతున్న రోషన్, అందంలోనూ, హైటులోనూ శ్రీకాంత్ కన్నా ఒక మెట్టు పైనే ఉన్నట్లు కనపడుతున్నాడు. అభినయంలో కూడా అలాంటి ప్రతిభే చూపితే శ్రీకాంత్ స్థానాన్ని ఆక్రమించుకోవడం అసాధ్యం కాకపోవచ్చన్నది పరిశీలకుల మాట.

ADVERTISEMENT
Latest Stories