Srinu Vaitla Gopichand Viswam

కామెడీ తో కూడిన యాక్షన్ జోనర్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారిన శ్రీను వైట్ల తన మునపటి ఫామ్ ను తిరిగి అందుకోవడానికి మళ్ళీ అదే తరహా మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

నీకోసం అంటూ రవితేజ ను హీరోగా పరిచయం చేస్తూ ఇండస్ట్రీలో దర్శకుడిగా మొదటి అడుగు వేసిన శ్రీను వైట్ల, ఆ తరువాత ఆనందం, సొంతం అంటూ యూత్ ఫుల్ మూవీలతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక తరువాత వచ్చిన రవితేజ వెంకీ మూవీ తో టాలీవుడ్ లో వన్ అఫ్ ది హిట్ దర్శకుల జాబితాలో చోటు సంపాధించుకున్నారు.

Also Read – ఎక్కడ తగ్గాలో కూటమిలో అందరూ నేర్చుకున్నట్లేనా?

ఇక అదే కోవలో మెగా స్టార్ చిరుతో అందరివాడు, నాగార్జున తో కింగ్, రామ్ తో రెడీ, మంచు విష్ణు తో ఢీ, రవితేజ తో దుబాయ్ శ్రీను వంటి వరుస హిట్లు అందుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ , సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నారు.

బాద్షా మూవీ తో జూ. ఎన్టీఆర్, దూకుడు మూవీ తో మహేష్ బాబు కాంబోలో వరుస విజయాలను అందుకున్న వైట్ల ఆగడుతో తన విజయాలు పరంపరకు బ్రేకులు వేశారు. ఆ తరువాత వైట్ల దర్శకత్వంలో వచ్చిన వరుణ్ తేజ్ మిస్టర్, రామ్ చరణ్ బ్రూస్లీ, రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ మూవీస్ పూర్తి గా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడ్డాయి.

Also Read – సెలబ్రేటీలు పిలిచినా రారు!… అవును ఎందుకు రావాలి?

దీనితో శ్రీను వైట్ల ఆగడు మూవీ తో టాలీవుడ్ లో ఆగిపోయాడు, ఇక ఆయన మూవీస్ వెండితెర మీద మ్యాజిక్ చెయ్యలేవు, ప్రేక్షకులను అలరించలేవు అంటూ అటు ఇంటబయట విమర్శలు ఎదుర్కొన్నారు వైట్ల.

అయితే తన మీద వస్తున్న విమర్శలకు కుంగిపోకుండా కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ వెండితెర మీద తన మ్యాజిక్ రిపీట్ చేయడానికి అదే యాక్షన్ కామెడీ జోనర్ ను నమ్మకుని హీరో గోపీచంద్ తో కలిసి ‘విశ్వం’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Also Read – భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందేవరు..?

ఈ సినిమా మీద అటు హీరో గోపీచంద్ కూడా వైట్ల తమ మార్క్ చూపించడానికి రెడీ గా ఉన్నారు అంటూ దర్శకుడి మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. అలాగే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ముఖ్యంగా ‘కొట్టారు తీసుకున్నాం ఇప్పుడు మా టైం వచ్చింది’ అంటూ హీరో గోపీచంద్ అప్ మాజీ ముఖ్యంమత్రి డైలాగ్ ను ఉచ్చరించడం కానీ, టీజర్ లో కనిపించిన ట్రైన్ సీన్స్ కానీ ప్రేక్షకులకు సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి.