‘బాహుబలి’ రెండవ పార్ట్ పై జక్కన్న ఏంటి ఇలా ఉన్నాడు!

SS Rajamouli silent about Baahubali 2“బాహుబలి” సినిమా మొదటి పార్ట్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సినిమాలో నటిస్తున్నారంటూ పలువురి హీరోలు, హీరోయిన్లు, నటుల పేర్లు తరచూ హల్చల్ చేసాయి. అయితే, వివిధ సందర్భాలలో స్వయంగా రాజమౌళినే వీటన్నింటి గుట్టు విప్పుకుంటూ వచ్చి, అవన్నీ పుకార్లుగా తేల్చేసారు. ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ లో ఎలా అయితే సినీ ప్రముఖుల పేర్లు పుకార్లు షికార్లు చేసాయో, రెండవ పార్ట్ షూటింగ్ ప్రారంభం కాక ముందు నుండే చాలామంది పేర్లు వినిపించాయి.

ADVERTISEMENT

అయితే ఈ సారి మాత్రం జక్కన్న స్పందించలేదు. ఎవరి పేర్లయితే హల్చల్ చేసాయో, వారే మీడియా ముఖంగా… ‘తాము బహుబలిలో నటించడం లేదు, నిజానికి ఈ సినిమాలో చిన్న అవకాశం చిక్కినా చేయాలనే ఉంది’ అంటూ అభిప్రాయ పడ్డారు. తాజాగా ఢిల్లీ భామ శ్రియా శేరన్ పేరు కూడా మారుమ్రోగిన విషయం తెలిసిందే. రానా సరసన శ్రియాను ఎంపిక చేసారని, ఫోటోషూట్ కూడా నిర్వహించారని ఇటీవల సందడి చేసిన వార్తలపై జక్కన్న క్లారిటీ ఇవ్వకపోగా, శ్రియా మాత్రం వివరణ ఇచ్చుకుంది.

‘బాహుబలి’లో తానూ నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని, అసలు ఇంతవరకు ఆ చిత్ర యూనిట్ తనను సంప్రదించలేదని, అయితే అవకాశం వస్తే మాత్రం వదులుకోను… అంటూ శ్రియా పలికిన చిలక పలుకులు బహుశా ఈ ముద్దుగుమ్మ అభిమానులను నిరాశపరిచి ఉంటాయి. అయితే రాజమౌళి వైఖరి చూసిన వాళ్ళు మాత్రం… మొదటి పార్ట్ సమయంలో వచ్చిన పుకార్లకు సమాధానమిస్తూ విసుగు చెందడంతోనే, ఈ సారి స్పందించడం లేదని అంటున్నారు. అంతేలే… రోజుకో పేరు తెరపైకి వస్తుంటే… జక్కన్న మాత్రం ఎన్ని సార్లని వివరణ ఇచ్చుకుంటారు..!

ADVERTISEMENT
Latest Stories