ఇంగ్లాండ్ చేతిలో 3-0 తేడాతో వన్డే సిరీస్ ను కోల్పోయిన ఆస్ట్రేలియా రధసారధి స్టీవ్ స్మిత్ పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడూ ప్రత్యర్ధి టీంను వివాదాల్లోకి నెట్టే ఆస్ట్రేలియా, ఈ సారి డిఫెన్స్ లో పడి సొంతగడ్డ పైనే ఆరోపణలను చవిచూస్తోంది. తాజాగా మూడవ వన్డేలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డారనేది లేటెస్ట్ అభియోగం.
ADVERTISEMENT
సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్ లో తన పెదవులకు ఉన్న లిప్ బామ్ ను తీసి బంతికి పూస్తున్న స్మిత్ దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే దీనిపై కామెంట్లు వినిపించగా, అనంతరం స్మిత్ బాల్ ను ట్యాంపర్ చేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్మిత్ వివరణ ఇస్తూ, తానేమీ బాల్ ను ట్యాంపర్ చేయలేదని, తన పెదవులపై అప్పుడు లిప్ బామ్ లేదని,తనపై అనవసరంగా ఆరోపణులు చేస్తున్నారని అన్నాడు.
ADVERTISEMENT



