ఇప్పటిదాకా అడ్డంగా బుకైనా ఆరుగురు కర్ణాటక బీజేపీ పెద్ద తలకాయలు!

Karnataka BJP in troubleకాసేపట్లో జరగబోతున్న కర్ణాటక బలనిరూపణ నేపథ్యంలో బీజేపీ ఇబ్బందుల్లో పడినట్టుగా కనిపిస్తుంది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే ఆత్రంతో ఆ పార్టీ నేతలు స్టింగ్ ఆపరేషన్ లకు దొరికిపోతున్నారు. ముఖ్యమంత్రి సైతం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తూ దొరికిపోయారు.

ADVERTISEMENT

ఆయనతో పాటు ఆయన కొడుకు రాఘవేంద్ర, మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్ధనరెడ్డి, శ్రీరాములు. కర్ణాటక బీజేపీ ఇంచార్జి మురళీధరరావు కూడా ఎమ్మెల్యేలతో భేరసారాలు జరుపుతూ అడ్డంగా దొరికిపోయారు. యడ్యూరప్ప రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.

విశ్వాస పరీక్షకు ముందే సభలో మాట్లాడి యడ్యూరప్ప గవర్నర్‌ను కలుస్తారని తెలుస్తోంది. ఇప్పటికే యడ్యూరప్ప తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా బీజేపీతో కలిశారని చెబుతున్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ క్యాంపులో చేరారు.

ADVERTISEMENT
Latest Stories