25వ సినిమా… ప్రామిసింగ్ లుక్స్..!

Subramanyapuram Movie Poster Talkkకెరీర్ లో పెద్దగా సక్సెస్ లు లేకపోయినా… అడపా దడపా కొన్ని సినిమాలు చేస్తోన్న అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్, ల్యాండ్ మార్క్ మూవీకి చేరువయ్యాడు. లైన్ లో ‘ఇదం జగత్’ సినిమా ఉండగా, ఆ తర్వాత తన కెరీర్ లో 25వ మూవీగా “సుబ్రహ్మణ్యపురం”ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ… త్వరలోనే వస్తాం… అంటూ స్పష్టం చేసాడు సుమంత్.

[m9ad]

ADVERTISEMENT

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా టైటిల్ అండ్ పోస్టర్స్ లో కూడా అదే సందేశాన్ని ప్రేక్షకులకు కలిగేలా డిజైన్ చేయిస్తున్నారు. టైటిల్ లో నాగుపాము, సుబ్రహ్మణ్య స్వామి సింబల్ మరియు ప్రీతిపాత్రమైన నెమలి జోడించగా, పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో కూడా ఆ నెమలి ఒక కన్నుతో ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న వైనాన్ని చూపించారు. సుమంత్ లుక్ సింపుల్ గా ఉండగా, గతంలో సక్సెస్ అయిన ‘కార్తీకేయ’ సినిమా ఛాయలు కాస్త కనపడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories