విడాకులు నుండి వెనక్కి తగ్గిన ‘సూపర్ స్టార్’

sudeep-not-to-divorce-wife-priya-radhakrishnanకన్నడ సూపర్ స్టార్ “బాహుబలి, ఈగ” చిత్రాల ఫేమ్ సుదీప్ తన మనసు మార్చుకున్నాడు. కుటుంబ కలహాలను పరిష్కరించుకుని, భార్యతో కలసి జీవించాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబ కలహాలతో సుదీప్ దంపతులు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. వీరిద్దరి నిర్ణయంతో వారి కుటుంబాల్లోనే కాక, సుదీప్ అభిమానుల్లో సైతం సంతోషం నెలకొంది.

ADVERTISEMENT

2001లో సుదీప్, ప్రియ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవాలని నిర్ణయించుకుని, విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భార్యకు పెద్ద ఎత్తున భరణం ఇచ్చేందుకు కూడా సుదీప్ సిద్ధమయ్యాడు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో, వీరిద్దరూ కలిసే బతకాలని నిర్ణయించుకోవడం అభినందించదగ్గ విషయం.

ADVERTISEMENT
Latest Stories