సుకుమార్ సినిమాలు ఆపేస్తే ఎలా? ఈ వార్త నిజమేనా..?

Sukumar movies“నాన్నకు ప్రేమతో” వంటి క్లాసికల్ మూవీని సెల్యులాయిడ్ పైకి ఎక్కించిన సుకుమార్ కు కథలు రాయడమంటే అమితమైన ఇష్టమని తెలుస్తోంది. చేతిలో మెగాఫోన్ పట్టుకోవడం కంటే పెన్ను పట్టుకోవడం లోనే బాగా ఇంట్రస్ట్ ఉన్న సుకుమార్ త్వరలో డైరెక్టర్ పోస్టుకు సెలవు ప్రకటించనున్నాడని, ఈ విషయాన్ని ఇటీవల ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రసంగిచారని తెలుస్తోంది.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టైలిష్ టేకింగ్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకడు. 2004లో అల్లు అర్జున్ తో ఆర్యతో ప్రారంభమైన మూవీ ద్వారా డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సుక్కూ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. “100% లవ్… 1 నేనొక్కడినే…” ఇలా చేసినవి కొన్ని సినిమాలే అయినా సుకుమార్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల నిర్మాతగా మారి “కుమారి 21ఎఫ్” సినిమాను నిర్మించి కమర్షియల్ హిట్ తన ఖాతాలో వేసేసుకున్నారు.

ఎన్టీఆర్ తో “నాన్నకు ప్రేమతో” సినిమా చేసి సక్సెస్ అందుకున్న దేవీ, ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్ ని హీరోగా ఓ సినిమా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇలా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సుకుమార్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. మరో ఒకటో రెండో సినిమాలు చేసి ఇక డైరెక్షన్ కు గుడ్ బై చెప్పేయాలని స్ట్రాంగ్ గా డిసైడైపోయాడట ఈ ఒకప్పటి లెక్కల మాస్టారు.

‘సుకుమార్ రైటింగ్స్’ పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పిన సుకుమార్ ఇకపై రైటర్ గాను, ప్రొడ్యూసర్ గానూ మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నాడట. ఇంతకీ సుక్కూ ఎందుకింత పెద్ద నిర్ణయం తీసుకున్నాడనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందన్నది కాలమే సమాధానం చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories