కాపీ సీన్లపై స్పందించిన సుకుమార్!

sukumar reacts on copy scenesసినిమాలలో కాపీ సన్నివేశాలను పెట్టడం షరా మామూలే! సుప్రసిద్ధ దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ ల నుండి అందరూ ఈ ‘కాపీ’ ఆరోపణలను ఎదుర్కొన్నవారే. నిజానికి కొన్ని సన్నివేశాలను చూస్తే, వీరు ‘కాపీ’ చేసారన్న నిర్ణయానికి ప్రేక్షకులు కూడా వచ్చేస్తారు. అయితే చాలా సందర్భాలలో తమ ‘కాపీ సీన్ల’ను దర్శకులు ఒప్పుకుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా సుకుమార్ దర్శకత్వం వహించిన “నాన్నకు ప్రేమతో” సినిమాలోని మూలకధ మరియు పలు సన్నివేశాలు హాలీవుడ్ సినిమాల నుండి కాపీ చేసారని సుకుమార్ పై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కాపీ సన్నివేశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ADVERTISEMENT

“ఎంతో కష్టపడి తీసిన సినిమాను కాపీ కొట్టి తీశారంటే తనకు చాలా బాధనిపిస్తుందని, ఒక్కో సమయంలో అయితే కోపమొస్తుందని, ఎంతో ఆలోచిస్తే వచ్చే సినిమాలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, కాపీ కొట్టాలనుకునేవాడినే అయితే ఆలోచించే వాడినే కాదని, ‘కాపీ-పేస్ట్’ పద్ధతిని అనుసరించే వాడినని” సుకుమార్ ఒకింత ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేసారు.

ADVERTISEMENT
Latest Stories