ట్రైలర్ టాక్ – బాలయ్య డైలాగ్స్ బాగా పేలాయి!

Sundeep Kishan Run Theatrical Trailerపవర్ ఫుల్ డైలాగ్స్ కు కేరాఫ్ అడ్రస్ నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సినిమాలు హిట్టవుతయో లేదో గానీ, ఆ సినిమాల్లోని డైలాగ్స్ మాత్రం బాగా ప్రజాదరణ పొందుతాయి. అంతలా సినీ ప్రేక్షకులను బాలయ్య డైలాగ్స్ ప్రభావితం చేస్తాయి. అయితే అవే బాలయ్య డైలాగ్స్ మరొకరి నోటి వెంట వస్తే… ఎలా ఉంటాయి..? ఖచ్చితంగా కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారతాయి.

సందీప్ కిషన్ “రన్” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ లో సరిగ్గా ఇదే జరిగింది. బాలకృష్ణ “లెజెండ్” సినిమాలో పలు సూపర్ హిట్ డైలాగ్స్ ను టీజర్ లో చూపించి నవ్వులు పూయించారు. బ్రహ్మాజీ చెప్పిన ‘ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు’ అనే డైలాగ్ కు తోడు, ట్రైలర్ లో చివరగా ఫోన్ రింగ్ ద్వారా వినిపించే బాలయ్య బాబు డైలాగ్స్ సినిమా విజయంపై నమ్మకాన్ని పెంచుతున్నాయి.

ADVERTISEMENT

తమిళ సినిమా “నేరం” ఆధారంగా రూపొందిన ఈ రీమేక్ సినిమా ట్రైలర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా సాగిపోయింది. హీరోయిన్ అనీషా అంబ్రోస్ లుక్స్, హావభావాలు ఆకట్టుకునే విధంగా ఉండగా, కధనం కాస్త కొత్తదనంతో నిండి ఉండడంతో ట్రైలర్ కు ఫ్రెష్ లుక్ ను తీసుకువచ్చింది. జనవరి 23వ తేదీ నుండి “రన్” సినిమా టైం ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

ADVERTISEMENT
Latest Stories