హీరోగా చేసిన తొలి సినిమాలు సక్సెస్ లు అయ్యాయని సునీల్ ఆనందపడినా… ఓ మంచి కమెడియన్ ను మిస్ అయ్యామని ప్రేక్షకులు అంతకుమించిన బాధపడ్డారు. కానీ రానూ రానూ హీరో అవతారం రాణించడం సునీల్ కు కష్టసాధ్యంగా మారిన తరుణంలో… మళ్ళీ కమెడియన్ రూపం దాలుస్తున్న విషయం తెలిసిందే. ఒక్కసారి కమెడియన్ గా మారితే సునీల్ రేంజ్ ఏంటో చాటిచెప్పే విధంగా సినీ అవకాశాలు తలుపు తడుతున్నాయి.
ఇప్పటికే శ్రీను వైట్ల – రవితేజల “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాలో కమెడియన్ గా చేస్తోన్న సునీల్, తాజాగా శర్వానంద్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా చేస్తోన్న “చిత్రలహరి” సినిమాకు కూడా సునీల్ సైన్ చేయడం అనేది…. సునీల్ కమెడియన్ స్థాయిని చాటిచెప్తోంది. హీరోగా ఎలాంటి స్థాయి ఉన్నా, కామెడీకి వచ్చేపాటికి తాను కింగ్ అని చెప్పకనే చెప్తున్నాడు సునీల్.



