‘పోర్న్ బ్యూటీ’తో ‘అడల్ట్’ ప్రశ్నకు ‘జవాబు’

sunny leone fires on Mediaతన గత జీవితాన్ని పక్కన పెట్టి, ప్రస్తుతం బాలీవుడ్ లో హిందీ సినిమాలు చేసుకుంటున్న ‘పోర్న్ బ్యూటీ’ సన్నీ లియోన్ ను ఓ విలేఖరి అడగరాని ప్రశ్నను అడగడంతో… సదరు జర్నలిస్ట్ చెంప పగలగొట్టిందని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గుజరాత్, సూరత్ లో ‘హోలీ’ కార్యక్రమం కోసం వెళ్ళిన సన్నీలియోన్ ను ఓ జాతీయ వార్తాఛానల్ కు చెందిన రిపోర్టర్… ‘ప్రస్తుతం హీరోయిన్ గా రాత్రి కార్యక్రమాల కోసం ఎంత తీసుకుంటున్నారు?’ అంటూ పరోక్షంగా ‘అడల్ట్’ ప్రశ్న వేయడంతో కోపంతో చిర్రెత్తిన సన్నీలియోన్, సదరు జర్నలిస్ట్ చెంపపై తన ‘అభయ’ హస్తాన్ని ఉంచిందని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

ADVERTISEMENT

చివరికి మీడియా వర్గాలు లేకపోతేనే కార్యక్రమంలో పాల్గొంటానని నిర్వాహకులతో సన్నీ తేల్చి చెప్పడంతో, మీడియా వర్గీయులను పంపించిన తర్వాతే కార్యక్రమం ముగించుకుని వెళ్ళిపోయిందంట. ఈ గందరగోళ వాతావరణం ఏర్పడిన సమయంలో సన్నీ భర్త డానియెల్ కూడా పక్కనే ఉన్నాడట. ఈ ఉదంతంతో గుజరాత్ అంటే ఈ ముద్దుగుమ్మ భయపడిపోతుందట.

ADVERTISEMENT
Latest Stories