‘పోర్న్ బ్యూటీ’ సన్నీలియోన్ పై కేసు!

Sunny Leone,Sunny Leone National Anthem,Sunny Leone National Anthem Controversy,Sunny Leone National Anthem Case,Sunny Leone National Anthem Pro Kabaddi‘ప్రో కబడ్డీ లీగ్’కు ప్రాచుర్యం కల్పించేందుకు టోర్నీ నిర్వాహకులు జాతీయ గీతం ఆలపించేందుకు గానూ కెనడాకు చెందిన ఎన్నారై ‘పోర్న్ స్టార్’ సన్నీలియోన్ ను ఎంపిక చేయడం ఒక సంచలనం అయితే, దానిని ఆమె చిత్రంగా ఆలపించడం ఇంకో కలకలం. హిందీ భాష సరిగా మాట్లాడడం చేతకాని సన్నీలియోన్ దేశభక్తిని చూసిన ప్రొకబడ్డీ నిర్వాహకులు ముంబైలో ప్రొ కబడ్డీ మ్యాచ్ ప్రారంభం సందర్భంగా సన్నీ లియోన్ తో జాతీయ గీతం పాడించారు.

భాషపై పట్టు లేకపోవడంతో సహజంగానే సన్నీ ఆలాపనలో పొరపాట్లు దొర్లాయి. పదాలను పలకడంతో పాటు, రాగం ఆలపించడం వరకు సన్నీలియోన్ పొరపాట్లు చేశారని, తద్వారా జాతీయ గీతాన్ని అవమానించారని పేర్కొంటూ ఢిల్లీ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది. వచ్చి రాని భాషతో సన్నీలియోన్ కొత్త చిక్కులు కొని తెచ్చుకుందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తన గీతాలాపనపై సన్నీలియోన్ సదరు స్టేజ్ పైనే వివరణ ఇచ్చుకుంది.

ADVERTISEMENT

ప్రొ కబడ్డీ మ్యాచ్ ప్రారంభానికి రావడం, ముఖ్యంగా జాతీయ గీతం ఆలపించడాన్ని గర్వంగా భావిస్తున్నానని చెప్పిన సన్నీ లియోన్, జాతీయ గీతం ఆలపించే సమయంలో కంగారు పడిన మాట వాస్తవమేనని అంది. అయితే ఆ గీతం ఆలపించడం తన అదృష్టమని పేర్కొన్న సన్నీ, తన జీవితం ధన్యమైందని తెలిపింది. ఈ గీతాలాపనకు చాలా సమయం ప్రాక్టీస్ చేశానని కూడా ప్రస్తావించింది.

ADVERTISEMENT
Latest Stories