ఫైనల్ మ్యాచ్ లో ‘టర్నింగ్ పాయింట్’ ఏది?

IPL 2016 finalక్రికెట్ ప్రేక్షకుల పండుగ ముగిసింది. బెంగుళూరు వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టును ఓడించి 2016 ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ వీక్షకుల పంట పండేలా చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ బ్యాట్స్ మెన్లు అది నుండి బెంగుళూరు బౌలర్లపై ఎదురుదాడి చేసారు. దీంతో ఉరకలెత్తిన స్కోర్ బోర్డు ఏకంగా 208 పరుగుల వద్ద ఆగింది.

ADVERTISEMENT

టాప్ ఎండ్ లో ధావన్ 28, యువరాజ్ 38 పరుగులతో అదరగొట్టగా, ఈ సీజన్లో హైదరాబాద్ కు అండగా ఉన్న కెప్టెన్ వార్నర్ మరోసారి తన సత్తా చాటి 69 పరుగుల చేసాడు. ఇక టెయిల్ ఎండ్ లో బెన్ కట్టింగ్ 15 బంతుల్లోనే 39 పరుగులు చేయడంతో 200 పరుగులు చేరువ కాదు అనుకున్న స్కోర్ ఏకంగా 208కి చేరింది. అయినప్పటికీ బెంగుళూరు బ్యాటింగ్ లైనప్ ముందు ఈ స్కోర్ ఏ మాత్రం నిలుస్తుందో అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. తొలి 10 ఓవర్ల వరకు జరిగింది కూడా అదే!

ఓపెనర్లు క్రిస్ గేల్ కీలకమైన మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్స్ కు చుక్కలు చూపించాడు. కేవలం 38 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేయడంతో తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 111 పరుగులు నమోదు చేసింది బెంగుళూరు జట్టు. అయితే 11వ ఓవర్లో గేల్ వికెట్ కోల్పోయిన బెంగుళూరుకు కెప్టెన్ విరాట్ కోహ్లి అండగా ఉండడంతో విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే అనుకోని ‘ట్విస్ట్’ శ్రాణ్ బౌలింగ్ రూపంలో 13వ ఓవర్లో ఎదురైంది… దీంతో మ్యాచ్ హైదరాబాద్ వైపుకు ‘టర్న్’ అయ్యింది.

ఫ్రంట్ ఫుట్ కు వచ్చి షాట్ కొట్టబోయిన కోహ్లి బ్యాట్ కు ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని బాల్ వికెట్ల పైన పడడంతో పెవిలియన్ బాట పట్టిన కోహ్లి అవుట్, మ్యాచ్ లో కీలకంగా మారిపోయింది. ఆ వెనువెంటనే డివిలియర్స్ 5, రాహుల్ 11, వాట్సన్ 11 వరుసగా ఒత్తిడిని అధిగమించలేక వికెట్లు కోల్పోవడంతో బెంగుళూరు పరాజయం ఖరారైంది. అయితే మరో వైపు బ్యాటింగ్ పిచ్ పై హైదరాబాద్ బౌలర్స్ అద్భుతమైన రీతిలో రాణించడంతో బంతిని బౌండరీలను దాటించడం కష్టసాధ్యమైంది. చివరికి 20 ఓవర్లలో 200 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.

ADVERTISEMENT
Latest Stories