ఇది మరీ నమ్మశక్యంగా ఉందా?

Sunrisers Vs Mumbai Indiansక్రికెట్ ను అమితంగా ఫాలో అయ్యే వారికి ఐపీఎల్ లో జరుగుతున్న మ్యాచ్ లు ఏ మాత్రం నమ్మశక్యంగా ఉండడం లేదు. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ… ఎవరో గెలుస్తారనుకుంటే, చివరికి వేరెవరో గెలవడం అనేది రొటీన్ కార్యక్రమంగా జరుగుతోంది. అప్పటివరకు టాప్ లో ఉన్న జట్టు ఒక్కసారిగా డౌన్ లోకి వెళ్ళిపోయి పరాజయం పాలు కావడం అనేది బహుశా ఒక్క ఐపీఎల్ లోనే జరుగుతుందేమో! అందుకు నిదర్శనం ముంబై – హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన తాజా మ్యాచ్.

సచిన్ పుట్టినరోజు నాడు జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే హైదరాబాద్ ను కేవలం 118 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో ఈ సీజన్ లో కేవలం ఒకే ఒక్క విజయంతో ఉన్న ముంబైకు రెండవ విజయం తధ్యం అని అంతా భావించారు. కానీ అలా జరిగితే ఐపీఎల్ లో ‘అద్భుతాలు’ ఎలా జరుగుతాయి? అనే విధంగా అనూహ్యంగా ముంబై బ్యాట్స్ మెన్లు చెత్త షాట్లు ఆడి, కేవలం 87 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. దీంతో 31 పరుగుల విజయంతో టాప్ 4లో సన్ రైజర్స్ చోటు సంపాదించుకుంది.

ADVERTISEMENT

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై బ్యాట్స్ మెన్లు ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఆడాల్సింది పోయి, అనవసరమైన షాట్లను ఆడి వికెట్లను నేలకూల్చుకున్నారు. సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం ఎంత బాగున్నప్పటికీ, 118 పరుగులు కష్ట సాధ్యమైన విషయం కాదు. ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు, ఐపీఎల్ లో దాదాపుగా 80 శాతం మ్యాచ్ లు ఇలాగే జరుగుతుంటాయి. తొలి 6 ఓవర్లలో 80, 90 పరుగులు చేసిన జట్లు మొత్తంగా 200 కూడా చేయలేకపోవడం, అలాగే ఫస్టాఫ్ లో 50 పరుగులు చేసిన జట్లు చివరికి 190 పరుగులు నమోదు చేయడం అనేవి ఐపీఎల్ లో సర్వసహజం.

ADVERTISEMENT
Latest Stories