జంపింగ్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు షాకింగ్ నిర్ణయం!

supreme court orders rebel MLAs can't vote,Uttarakhand ఓ పార్టీ టికెట్ పై విజయం సాధించి… ఆ తర్వాత పార్టీ జెండా మార్చేసే ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను చర్చనీయాంశంగా మారిన ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఈ దిశగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఉత్తరాఖండ్ లో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఓటు హక్కును రద్దు చేస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయం కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి కూడా మొట్టికాయేనని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కోర్టు నిర్ణయం ప్రకారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొన్నటిదాకా కాంగ్రెస్ సభ్యులుగానే ఉండి తాజాగా బీజేపీ పంచన చేరిన 9 మంది ఎమ్మెల్యేలకు బల పరీక్షలో పాల్గొనేందుకు ఓటు హక్కుండదు.

ADVERTISEMENT

ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఉత్తరాఖండ్ వరకే పరిమితం అయినప్పటికీ, భవిష్యత్తులో కూడా ‘జంపింగ్ ఎమ్మెల్యేల’పై ఇదే రకమైన తీర్పును వెలువరించవచ్చన్న అభిప్రాయానికి బలం చేకూరుతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన వైనం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories