‘సుజనా చౌదరి’కి ఊరట… ‘సీబీఐ’కు ‘నో’ అన్న సుప్రీం..!

supreme court says no cbi enquiry on sujana chowdary, TDP‘సుజన’ గ్రూపు సంస్థల్లో చోటు అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలంటూ వినోద్ కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ విచారణకు అర్హత కాదని స్పష్టం చేస్తూ.., దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

దీనిపై సరైన న్యాయస్ధానాన్ని ఆశ్రయించాలని పిటిషనర్ కు సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీం ఇచ్చిన తీర్పుతో సుజనా చౌదరికి ఊరట లభించినట్లయ్యింది. వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ మారిషస్ బ్యాంకు న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ‘సుజన’పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories