నీ రాక అనివార్యం సూర్య..!

Surya Kumar Yadav

ఈ ఐపీఎల్ సిరీస్ లో అత్యంత పేలవమైన ఆట తీరుతో ముంబై ఇండియన్స్ , తమ ఫాన్స్ ను నిరుత్సాపరుస్తున్నారు. ఇటువంటి సందర్భంలో సూర్య కుమార్ యాదవ్ తిరిగి టీంలోకి రావడం ముంబై టీమ్ కు ఒక శుభపరిణామమనే చెప్పాలి. ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్ లలోను అనుకోని ఓటమి పలకరించడంతో అభిమానులు పూర్తి నైరాశ్యంలోకి వెళ్లిపోయాయిరు.

ఒక పక్క రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పూర్తి ఆగ్రహంలో ఉన్న ముంబై ఫాన్స్ కొత్త కెప్టెన్ గా వచ్చిన హార్దిక పాండ్య ను అంగీకరించలేకపోతున్నారు. ఆడిన ప్రతి మ్యాచ్ లోను ఓటమి చెందడం, దానికి తోడు హార్దిక్ పై వస్తున్న విమర్శలతో ముంబై టీమ్ మరింత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ADVERTISEMENT

దీనికి తోడు టీమ్ మెంబెర్స్ మధ్య సఖ్యత, సమిష్టి కృషి సరిగా లేకపోవడంతో కెప్టెన్ ను మార్చాలంటూ ఫాన్స్ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కుంటున్నారు ముంబై ఫ్రాంచైజీ. ఆడిన మొదటి మూడు మ్యాచులు ఓటమి చెందడంతో ప్లే అఫ్ ఛాన్స్ లు నీరుగారుతున్న ఈ తరుణంలో ‘స్కై ఈస్ బ్యాక్’…అంటూ వస్తున్న వార్తలు ముంబై ఫాన్స్ లో మంచి ఉత్సహాన్ని నింపుతున్నాయి.

టి – 20 ఇంటర్ నేషనల్ మ్యాచ్ లలో నెంబర్ 1 స్థానం లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ గాయం కారణంగా ఈ సీజన్ ఐపీఎల్ కు దూరమయ్యారు. టి 20 లలో తన విధ్వంసకర బ్యాటింగ్ తో గ్రౌండ్ లో 360 డిగ్రీస్ తన బ్యాట్ కు పని చెప్పగలిగిన ఏకైక ఇండియన్ బ్యాట్స్ మన్ గా సూర్య కుమార్ యాదవ్ కు ఖ్యాతి గడించారు. ఇంజురీ నుంచి సూర్య పూర్తిగా కోలుకుని ఫిట్ గా ఉన్నారని బెంగళూర్ NCA ప్రకటించింది.

దీనితో వచ్చే ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగబోయే ముంబై మ్యాచ్ కు సూర్య కుమార్ సెలక్షన్ కు అందుబాటులో ఉంటారంటూ పలు రిపోర్ట్స్ వస్తున్నాయి. అసలే ఓటమి నిరుత్సహంలో ఉన్న ముంబై ఫాన్స్ కు ఆదివారం జరిగే మ్యాచ్ హోమ్ గ్రౌండ్ కావడం, అందునా స్కై వస్తున్నాడు అంటూ వచ్చిన వార్తలతో…’నీ రాక ఇక అనివార్యం’ సూర్య అంటూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ముంబై ఫాన్స్.

ADVERTISEMENT
Latest Stories