ఈ పాటలో అంత సీన్ ఉందా?

Swag-Se-Swagat-Songగతేడాది డిసెంబర్ 22న విడుదలై బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేసిన “టైగర్ జిందా హై” సినిమాలో ఓ వీడియో సాంగ్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. యూ ట్యూబ్ లో ఇప్పటివరకు ఏ ఇండియన్ సాంగ్ కు రాని విధంగా ఏకంగా 500 మిలియన్ క్లిక్స్ తో ఆల్ టైం రికార్డులను నెలకొల్పింది. సినిమా రిలీజ్ కు ఒక నెల రోజు ముందుగా పబ్లిసిటీలో భాగంగా యూ ట్యూబ్ లో రిలీజ్ చేసిన ‘స్వాగ్ సే స్వాగత్’ అనే పాటకు వీక్షకులు ఫిదా అయ్యారు.

విశాల్ అండ్ శేఖర్ ల ద్వయం అందించిన సంగీతం ఈ రికార్డులో కీలక భూమిక పోషించగా, దానిని కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ మరో ఎత్తుకు తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యారు. సల్మాన్ – కత్రీనాలపై చిత్రీకరించిన ఈ పాటలో హావభావాలు మాస్ కు కావాల్సిన కిక్ ను పంచుతున్నాయి. అందుకే 170 సెకన్ల వీడియోకు 50 కోట్ల క్లిక్స్ దాసోహం అన్నాయి. మరి మీరూ ఓ సారి ఈ రికార్డ్ వీడియో సాంగ్ పై ఓ లుక్కేయండి!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories