హీరోయిన్ కు చుక్కలు చూపిస్తోన్న నెటిజన్లు!

Taapsee Pannu - Latest Controversyనోరు అదుపులో పెట్టుకోకుండా తెలుగు చిత్ర సీమ గురించి, సుప్రసిద్ధ దర్శకుడు రాఘవేంద్రరావు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన తాప్సీకి తెలుగు సినీ అభిమానులు చుక్కలు చూపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తాప్సీపై విమర్శల వర్షం కురిపిస్తున్న నెటిజన్ల ధాటికి తట్టుకోలేక, టాలీవుడ్ కు చెందిన చాలా మందిని ‘బ్లాక్’ చేసుకుంటూ వెళ్తుందన్న విషయం బయటపడింది.

తాప్సీ పేలిన అవాకులు, చవాకులపై టాలీవుడ్ సినీ పెద్దలు ఎలాంటి అభిప్రాయాలు వెల్లడిస్తారో తెలియదు గానీ, ఆమె వ్యాఖ్యలు సినీ అభిమానులు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. దీంతో సదరు వీడియోను షేర్ చేస్తూ… ‘షేమ్ లెస్ తాప్సీ’ అన్న ట్యాగ్ లైన్ తో టార్గెట్ చేయగా, అందులో తాను ఫాలో అవుతున్న వారిని బ్లాక్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఉదంతం నెటిజన్లకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది.

ADVERTISEMENT

త్వరలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన “ఆనందో బ్రహ్మా” సినిమా విడుదల కానుండడంతో, ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యల పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియనుంది. ‘అడుసు తొక్కనేల… కాలు కడగనేల…’ అన్న చందంగా… ‘నోరు జారనేల… బ్లాక్ చేయనేలా…’ అని చెప్పక తప్పదు. మొత్తమ్మీద తెలుగు సినీ అభిమానుల ట్వీట్లకు తాప్సీ నరాలు ‘ఝుమ్మంది నాదం’ అంటున్నాయేమో..!

ADVERTISEMENT
Latest Stories