ఫస్ట్ టైం… సీనియర్ హీరోతో చేస్తోంది..!

Tamannaah Bhatia to romance with venkateshటాలీవుడ్ ‘మిల్కీ బ్యూటీ’ తమన్నా సౌందర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి లాంటి వారే ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా అయ్యి, తనతో నటించాలన్న ఆకాంక్షను బహిరంగంగా వెలిబుచ్చిన వైనం అందరికీ తెలిసిందే. ఇక ‘బాహుబలి’ తర్వాత అయితే ఒక్క టాలీవుడ్ లోనే కాదు, అన్ని ఇండస్ట్రీలలోనూ తమన్నా పేరు హాట్ టాపిక్ గా హల్చల్ చేసింది.

ADVERTISEMENT

ఇటీవలే ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా, తెలుగులో తన భవిష్యత్తు సినిమాల గురించి ఓ స్పష్టమైన ప్రకటన చేసింది. ఇందులో వెంకటేష్ – వరుణ్ తేజ్ ల “ఎఫ్ 2” సినిమా కూడా ఉండగా, తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ నుండి దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. విక్టరీ వెంకటేష్ సరసన తమన్నా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు జతగా మెహ్రీన్ ను ఎంపిక చేసినట్లుగా ప్రకటించారు.

ఇప్పటివరకు యువతరం హీరోల సరసన మాత్రమే నటించి, క్రేజ్ సంపాదించుకున్న తమన్నా, మొదటిసారిగా సీనియర్ హీరో జాబితాలో ఉన్న వెంకటేష్ కు జోడిగా నటిస్తుండడం విశేషం. ‘సైరా’ చిత్రంలో చిరంజీవికి జతగా చేస్తున్నప్పటికీ, అది లిమిటెడ్ రోల్ అన్న విషయం తెలిసిందే. యువహీరోల సరసనే స్టన్నింగ్ గా కనిపించే తమన్నా, మరి ఈ సీనియర్ హీరోను డామినేట్ చేసే విధంగా దర్శనమిస్తుందో లేదో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories