సుప్రీంకోర్టు మొట్టికాయలు అంత సమ్మగా ఉంటాయా సార్?

Supreme Court order on Tirupparankundram temple Deepam

కేంద్ర ప్రభుత్వంతో సహా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏదో ఓ సందర్భంలో సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు తప్పవు. అయితే ఆ అవసరం లేనప్పుడు కూడా వెళ్ళి మొట్టికాయలు వేయించుకుంది తమిళనాడులో జోసఫ్ విజయ్‌ ప్రభుత్వం.

అదీ.. కొండపై ఉన్న ఒక రాతి స్థంభంపై కార్తీకమాసంలో దీపం వెలిగించే విషయంలో!

ADVERTISEMENT

తమిళనాడులోని మదురై జిల్లాలోని తిరుప్పరంకుండ్రం కొండపై వెలిసిన సుబ్రహ్మణ్య స్వామీ ఆలయం సమీపంలోనే సికిందర్ దర్గా ఉంది. అక్కడే ఓ రాతి స్థంభం(దీపత్తూన) ఉంది. అనాదిగా దానిపైనే కార్తీకమాసంలో దీపం వెలిగించేవారు.

కానీ దానిపై దీపం వెలిగించే విషయంలో వివాదాలు మొదలవడంతో అక్కడ దీపం వెలిగించడం మానేశారు. కనుక చాలా ఏళ్ళ నుంచి స్వామివారి ఆలయంలోని దీప మండపంలో కార్తీక దీపం వెలిగిస్తున్నారు.

ఈ వ్యవహారం మొదట మదురైలోని మద్రాస్ హైకోర్టు బెంచ్‌కు చేరింది. రాతి స్థంభంపై దీపం వేలించాలని గత ఏడాది హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదు!

ఇప్పుడీ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున కొండపై ఉన్న రాతి స్థంభంపై తప్పనిసరిగా కార్తీక దీపం వెలిగించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ విజయ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదు!

ఇది కోర్టుధిక్కారమే అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ, మదురై జిల్లా కలెక్టర్‌తో పాటు ఆలయ ధర్మకర్తలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

ఆలయ ధర్మకర్తల మండలిని తక్షణం సస్పెండ్ చేసి, తిరుప్పరంకుండ్రం కొండ, దానిపై స్వామివారి ఆలయం, రాతి స్థంభం బాధ్యతను సీఆర్పీఎఫ్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈసారి రాతి స్థంభంపై దీపం వెలిగించే బాధ్యత వారికి, రాష్ట్ర పోలీస్ శాఖకు, ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. రేపు (శనివారం) తప్పనిసరిగా కొండపై గల రాతి స్థంభంపై కార్తీక దీపం వెలగించాల్సిందేనని స్పష్టం చేసింది.

దీపం వెలిగించకుండా వచ్చి మళ్ళీ కథలు చెప్తే వినే ప్రసక్తి లేదని, బాధ్యులపై కోర్టు ధిక్కార నేరానికి చర్యలు తప్పవని హెచ్చరించింది. తదుపరి విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

ఇలాంటి పరిస్థితి రాకుండా విజయ్‌ ప్రభుత్వం దీపం వెలిగింపజేయవచ్చు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే అదే విషయం సుప్రీంకోర్టుకు ముందే తెలియజేస్తే అదే పరిష్కారం చూపేది. కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి మొట్టికాయలు వేయించుకున్నారు. ఇంతకాలం తమిళనాడు ప్రజలకు మాత్రమే తెలుసు. ఇప్పుడు యావత్ దేశ ప్రజలకు తెలిసింది.

ADVERTISEMENT
Latest Stories