తప్పులేదు ఇండస్ట్రీ అంటేనే కాస్త లౌకికత్వం ఉండాలి, అదే క్రమంలో హీరోలను, దర్శకులను పొగడాలి. వారితో మంచి ర్యాపొ మైంటైన్ చెయ్యాలి. అప్పుడే మనం పెట్టిన నాలుగు రాళ్ళ పెట్టుబడి నలబైగా మారుతుంది. బహుశా కొత్త ప్రొడ్యూసర్ కదా అందుకే సడన్ గా అలా ఓవర్ గా మాట్లాడేసాడు అనుకుంట. కాకపోతే మరీ బాహుబలితో పోల్చి విజయ్ దేవరకొండను పీక్స్ కి తీసుకెళ్లిపోయాడు. ఇంతకీ ఏంటి బాహుబలి-విజయ్ దేవరకొండ వ్యవహారం? ఎవరు ఆ లౌకిక వాదం కాస్త ఎక్కివైన ప్రొడ్యూసర్ అంటే…
[m9ad]
టాక్సీవాలా సినిమాకి నిర్మాతగా మారిన “SKN” నిన్న టాక్సీ వాలా సక్సెస్ మీట్ లో మైక్ దొరకగానే విజయ్ దేవరకొండని ఆకాశానికి ఎత్తేసి తెగ పొగిడేసాడు. అయితే ఇలాంటి ఫంక్షన్స్ లో అలాంటి పొగడ్తలు షరా మామూలే అనుకోండి..పైగా విజయ్ స్పీడ్ కూడా మంచి హైలో ఉంది అనుకోండి, కానీ తెలుగు ఇండస్ట్రీని మాహిష్మతీ రాజ్యంగా పోల్చి, విజయ్ ని బాహుబలిగా పోల్చి… “మాహిష్మతీ ఊపిరి తీసుకో బాహుబలి వచ్చాడు” అన్న డైలాగ్ ని “తెలుగు ఇండస్ట్రీ ఊపిరి తీసుకో … విజయ్ దేవరకొండ వచ్చాడు” అంటూ చెప్పడం ఏదైతే ఉందో..అది మరీ అతిగానే అనిపిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఏది ఏమైనా పైరసీ అయిపోయిన సినిమా తోలి రోజే బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ అయిన ఆనందంలో అలా కాస్త హైపర్ గా మాట్లాడేసాడు కుర్ర నిర్మాత అని సరిపెట్టుకోవడమే.



