ఇదిగో ఫోరెన్సిక్ రిపోర్ట్… చర్యలు తీసుకోగలరా?

TDP Leader Pattabhi gets forensic report on gorantla video callవైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ డర్టీ పిక్చర్ ఒరిజినల్ వీడియో దొరకలేదని, సర్క్యులేషన్‌లో ఉన్నవన్నీ పైరేటడ్ వెర్షన్సే అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తేల్చి పడేశారు. కనుక ఎంపీ గోరంట్ల నిజంగానే ఆ షో చేశారా లేదా అనేది ఒరిజినల్ వీడియో దొరికి, దానిని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి చెపితే గానీ నిజానిజాలు తెలుసుకోలేమని ఎస్పీ ఫకీరప్ప చెప్పి గోరంట్లకు క్లీన్ చిట్ ఇచ్చేశారు.

గోరంట్లను తప్పించడంతో సరిపెట్టుకొని ఉంటే టిడిపి నేతలు ఇంతగా వైసీపీ వెంటపడేవారే కారు. కానీ ఎప్పుడైతే వైసీపీ మంత్రులు, పార్టీ నేతలు ఈ నిందను టిడిపిపైకి తోసేసి వారినే ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని ప్రయత్నించారో, అప్పుడే టిడిపి సీనియర్ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభి ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్‌గా తీసుకొన్నారు. ఆ వీడియో క్లిపింగును అమెరికాలో ప్రసిద్ది చెందిన ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి నివేదిక కోరారు.

ADVERTISEMENT

ఆ సంస్థలో ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్ స్టాఫ్ వార్డ్ ఆ వీడియో క్లిప్పింగును శాస్త్రబద్దంగా అత్యాధునిక పరికరాలు, టెక్నాలజీతో పరీక్షలు జరిపి ఆ వీడియోలో ఉన్నది వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవే అని స్పష్టంగా నివేదికలో పేర్కొన్నారు.

పట్టాభి ఆ నివేదిక కాపీలను శనివారం విజయవాడలో మీడియాకు అందజేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పటివరకు ఫోరెన్సిక్ నివేదిక రాలేదు కనుక గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవడం లేదని మంత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి చెపుతూ వచ్చారు. ఇదిగో… మీరు అడుగుతున్న ఫోరెన్సిక్ నివేదిక! ఆ వీడియోలో ఉన్నది మీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.

గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ఆడియో సంభాషణలు బయటకు లీక్ అయినప్పుడు సిఎం జగన్ ఏవిదంగా వెనకేసుకువచ్చారో చూశాము. కనుక గోరంట్ల మాధవ్‌ను అలాగే వెనకేసుకు వస్తారని ముందే గ్రహించి ఈ వీడియోను అమెరికాలో ప్రముక ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్ష చేయించడానికి పంపించి నివేదిక తెప్పించాము.

ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదిక మీకు అందించాము కనుక ఇకనైనా మీ ఎంపీపై చర్యలు తీసుకొనే ధైర్యం మీ సిఎం జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా? వీడియో మార్ఫింగ్ జరగలేదని చెప్పడానికి ఈ ఆధారాలు చాలా ఇంకా ఏమైనా కావాలా?” అని ప్రశ్నించారు.

ADVERTISEMENT
Latest Stories