గతంలో బికాంలో ఫిజిక్స్ అంటూ సోషల్ మీడియాకు ఆహారం అయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మరోసారి నెటిజన్లకు దొరికేసాడు. గత రెండు రోజులుగా హరికృష్ణ మరణంతో అంతా సైలెంట్ అవ్వడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఊపుతోంది. ఇటీవల గుంటూరులో టిడిపి నిర్వహించిన ‘నారా హమారా – టిడిపి హమారా’ కార్యక్రమంలో పాల్గొన్న జలీల్ ఖాన్ తన ప్రసంగంలో ఓ కీలకమైన ఇలా దొరికిపోయారు.
[m9ad]
ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ చేసిందేం లేదంటూ విమర్శిస్తున్న జలీల్ ఖాన్, ఆ క్రమంలో “రాజశేఖర్ రెడ్డి మరియు వాళ్ళ నాన్న జగన్ మోహన్ రెడ్డి”లు కూడా చేసిందేం లేదని విమర్శించారు. జగన్ మరియు వాళ్ళ నాన్న రాజశేఖర్ అనాల్సిన చోట, రివర్స్ లో అన్న జలీల్ ఖాన్ ను సోషల్ మీడియా జనులు ఒక రేంజ్ లో వేసుకుంటున్నారు. ఈ విధంగా ప్రసంగించడం ఒక్క జలీల్ ఖాన్ కే సాధ్యం అన్నట్లుగా విరుచుకుపడుతున్నారు.
పబ్లిసిటీ కోసం కావాలని అన్నారో లేక పొరపాటు దోర్లిందో గానీ ఇలా వరుసగా తప్పులు దొర్లడం జలీల్ ఖాన్ కు రాబోయే కాలం ప్రతికూలంగా మారుతుందని గమనించాలి. నిజానికి ఇదేం పెద్ద విషయం కాకపోయినా, నేడు ప్రజలు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు గనుక, మరింత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేదు అనుకుంటే, ఇలాగే నెటిజన్లకు వినోదాన్ని అందించే వ్యక్తిగా మిగిలిపోతారు.



