మాట తప్పను మడమ తిప్పను అని జగన్ చెప్పేది వట్టిదేనా?

TDP MLA Vasupalli Ganesh joining ysrcpవిలువలు… విశ్వసనీయత… మాట తప్పను మడమ తిప్పను అని జగన్ తరచు చెబుతూ ఉంటారు. రాజకీయాలలో చంద్రబాబు వంటి వారు వాటిని పాటించారు అని ఎద్దేవా చేసే వారు. అయితే అవన్నీ వట్టిమాటలేనా అంటూ ఇప్పుడు జగన్ విమర్శలు ఎదురుకుంటున్నారు… వివరాల్లోకి వెళ్తే… టీడీపీ నుండి నాలుగవ ఎమ్మెల్యే బయటకు వచ్చారు.

సీఎం క్యాంప్‌ ఆఫీసులో సీఎం వైఎస్ జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ భేటీ అయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి గణేష్‌ను వెంటబెట్టుకుని వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమారులకు కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. అనర్హత తప్పించుకోవడానికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పుకోలేదు.

ADVERTISEMENT

అయితే ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ పార్టీలో చేరినట్టు చెప్పారు. ఒకపక్క వలసలను ప్రోత్సహిస్తూ… ఉపఎన్నికలు రాకుండా… రాజీనామా చెయ్యకుండా తీసుకున్నాం అని అనిపించుకోకుండా తమ విలువలకు టెక్నికల్ కారణాలు అడ్డుపెట్టుకుంటున్నారు జగన్. ఇది నీతిమంతమైన విలువల అంటే కచ్చితంగా కాదనే చెప్పుకోవాలి.

151 సీట్లు వచ్చినా అదే అభద్రతా భావం… వేలకోట్లు గుమ్మరిస్తున్నా ఉపఎన్నికలు ఎదురుకునే ధైర్యం లేకపోవడం ఏంటి? అంటూ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే గెలిచిన 23 సీట్లలో ఇప్పటికే నాలుగు సీట్లు పోగొట్టుకుంది. గతంలో వలసలు ప్రోత్సహించడంతో ఇప్పుడు ఎటు మాట్లాడలేని పరిస్థితి.

ADVERTISEMENT
Latest Stories