‘శాతకర్ణి’లో నటించిన తెలుగుదేశం ‘ఎమ్మెల్సీ’

TDP-MLC-Pamidi-Samanthakamani-in-Gautamiputra-Satakarniఅనంతపురం జిల్లా మహిళా నేత, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ శమంతకమణి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో నటించడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా శమంతకమణియే మీడియా వర్గీయులకు వెల్లడించారు. అంతేకాదు, సినిమాలో తాను నటించిన సన్నివేశం గురించి వివరించారు. బాలకృష్ణ, శ్రేయలు మారువేషంలో ఓ గ్రామీణ మార్కెట్ కు వెళ్లిన సమయంలో శమంతకమణి కనిపిస్తారట.

ADVERTISEMENT

ఆ సమయంలో శాతకర్ణి (బాలకృష్ణ) జేబు నుంచి ఓ నాణెం కింద పడిపోతుంది. అదే నాణెంపై శ్రేయ కాలుమోపబోగా, అక్కడి మార్కెట్ లో మహిళా వ్యాపారి పాత్రలో నటిస్తున్న శమంతకమణి దాన్ని చూస్తారు. శ్రేయ ఆ నాణెంపై కాలు పెట్టే సమయంలో తన చెయ్యి పెట్టి అడ్డుకుంటారు. “కాలు తీయ్‌… మా దేవుడినే తొక్కుతావా?” అంటూ గద్దిస్తారు కూడా. ఆ నాణెం ‘శాతకర్ణి’ ముఖ చిత్రంతో ఉన్నదే కావడం విశేషం.

ఇలా రెండు నిమిషాల పాటు సాగే సన్నివేశంలో తాను నటించానని శమంతకమణి తెలిపారు. తన పాత్ర గురించిన మరిన్ని వివరాలు సినిమా చూస్తే తెలుస్తాయని ఎంతో సంతోషంతో చెప్పారు. అమరావతి చరిత్రతో కూడుకుని ఉన్న ఈ సినిమా కధలో చిన్న భాగస్వామి కావడం మంచి అనుభూతిని మిగిలించిందని అభిప్రాయపడ్డ శమంతకమణి, ఈ రోజు తిరుపతిలో జరగనున్న ఆడియో వేడుకలో కూడా ప్రత్యక్షం కానున్నారు.

ADVERTISEMENT
Latest Stories