ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతిపక్ష నేతగా క్రియాశీలక పాత్ర పోషించే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. గోల్ఫ్ ఆడుతూ సందడి చేసిన జగన్ ఫోటోల హంగామా ముగియక ముందే చెస్ ఆడుతున్న జగన్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అలా కుటుంబ సభ్యులతో కలిసి హల్చల్ చేస్తున్న జగన్ కు సంబంధించి మరికొన్ని ఫోటోలు దర్శనమిస్తున్నాయి.
పిల్లలతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడుతున్న జగన్ ఫోటోలు మళ్ళీ సోషల్ మీడియాలో విడుదల అయ్యాయి. ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులతో కలిసి ఇంత లాంగ్ టూర్ ఎప్పుడూ వెళ్ళకపోవడంతో… రాజకీయంగా కూడా ఈ టూర్ చర్చలకు దారి తీసింది. అయినప్పటికీ, జగన్ టూర్ పై టిడిపి నేతలు ఒక్క విమర్శ కూడా చేయకపోవడం విశేషం. ఎంత రాజకీయాలు చేసినా నేతలకు కుటుంబ జీవితం ఉంటుందని గుర్తించడం వలనే జగన్ లండన్ టూర్ పై ప్రత్యర్ధి వర్గీయులు ఎలాంటి కామెంట్లు చేయలేదన్నది పొలిటికల్ వర్గాల టాక్.
అయితే ఒక్కసారి సీన్ రివర్స్ చేస్తే… ఇటీవల చంద్రబాబు కూడా ఒక ఫారిన్ టూర్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జగన్ చేసిన విమర్శలు ప్రజల్లో చీదరింపుకు గురయ్యాయి. జగన్ మాదిరి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయకుండా హుందాతనంగా వ్యవహరిస్తున్న టిడిపి వర్గీయులను ఈ సందర్భంగా అభినందించి తీరాల్సిందే.



