ఎన్నో చేదు అనుభవాల మధ్య ఇవాళ మొదలైన భారత్ vs ఆస్ట్రేలియా 5వ టెస్ట్ లో మొదటి రోజు ఆట ముగిసింది. ఈసారైనా భారత బ్యాటర్లు ఆకట్టుకుంటారేమో అని ఎదురుచూసిన భారత అభిమానులకు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. ఉదయానే 4:30 గంటలకు టాస్ జరగగా, మ్యాచ్ ను 5:00 గంటలకు ప్రారంభించారు. ఇక, టాస్ గెలిచిన కెప్టెన్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు.
నిన్నటి నుండి ప్రచారమవుతున్న పుకారు నిజమేనంటూ నేడు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుండి విరమించుకున్నారు. ఇక కెప్టెన్ గా ఈ సిరీస్ లో 2వ మ్యాచ్ ఆడారు బుమ్రా. ఇక ఓపెనర్ గా వచ్చిన రాహుల్ కేవలం 5 ఓవర్లు మాత్రమే క్రీజులో నిలిచారు. యశస్వి కూడా తన రేంజ్ ఇన్నింగ్స్ ఆడటంతో విఫలమయ్యారు. నిలదొక్కుకున్న గిల్-విరాట్ ల జోడి సెషన్ చివరి బంతికి అవుట్ అయి వెనుదిరిగాడు శుబ్మాన్ గిల్.
ఇక ఈ సిరీస్ లో అవుట్ అయిన ప్రతిసారి ఆ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ కే తన వికెట్ సమర్పించుకుంటున్నారు కోహ్లీ. ఈ సిరీస్లో వరుసగా 7 సార్లు అదే విధంగా అవుట్ అయ్యారు విరాట్. పంత్-జడేజా ల జోడి కూడా ఎక్కువ సమయం క్రీజులో నిలువలేదు. ఇక పంత్ అవుట్ అవగానే, భారత బ్యాటర్లు మరోసారి పెవిలియన్ కు క్యూ కట్టేశారు. వచ్చిన వారు వచ్చినట్టు వెనుదిరిగారు.
అయితే ఈ క్రమంలోనే సుందర్ ను అవుట్ గా ప్రకటించిన ఎంపైర్ నిర్ణయం పై మరోసారి అసంతృప్తి గా ఉన్నారు భారత ఆటగాళ్లు. బుమ్రా ఈ విషయమై అంపైర్ తో మాట్లాటం కూడా చూసాము. ఇక, బుమ్రా కీలకమైన 22 పరుగుల సహాయంతో 185 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయ్యారు టీం ఇండియా. ఇక, ఆస్ట్రేలియా బ్యాటర్లు 3 ఓవర్ల ఆట సమయం మిగిలి ఉండగా బ్యాటింగ్ కు వచ్చారు.
మొదటి బంతికే కొన్స్టాస్ బుమ్రా కు బౌండరీ తో ఆహ్వానమిచ్చాడు. అప్పటినుండి బుమ్రా కాస్త తన శైలికి విరుద్ధంగా కాస్త అగ్రెసివ్ గా కనింపించాడు. ఇక ఇవాళ్టి ఆటకు చివరి ఓవర్ 5వ బంతి వేస్తున్న క్రమంలో కొన్స్టాస్-బుమ్రా కు మధ్య వాగ్వాదం జరగగా, ఆఖరి బంతికి బుమ్రా ఖవాజా వికెట్ తీసుకున్నాడు.
దీనితో భారత ఆటగాళ్లంతా కొన్స్టాస్ ను చుట్టుముట్టి చాలా అగ్రెసివ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. దీనితో, ఇదంతా కేవలం ట్రైలర్, అసలు సినిమా రేపు ఉంటుందని భారత అభిమానులు రేపటి ఆట కోసం ఉర్రూతలూగుతున్నారు. అయితే రేపటి ఆటలో భారత్ ఆటగాళ్లకు తమ బ్యాట్ తో కౌంటర్ ఇవ్వడానికి ఆసీస్ కూడా సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఇక రేపు గ్రౌండ్లో బౌలర్ vs బ్యాట్స్ మెన్స్ యుద్ధం జరగబోతుందన్న మాట.




