ఆ కులం ఓట్లు నాకొద్దు…! అహంకారామా..అవివేకమా.?

teenmar-mallanna

చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈయనగారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గా తెలంగాణ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే రాజకీయాలలో ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకునే నాయకులెవ్వరూ ఒక కులం ఆధారంగానో ఒక మతం చాటునో రాజకీయం చెయ్యడానికి ఆసక్తి చూపించారు.

ADVERTISEMENT

ఒకవేళ అలా ఒకే కులాన్ని నమ్ముకుని రాజకీయం చేసినా సదరు వ్యక్తి ఎప్పటికి రాజకీయాలలో రాణించలేరు. ఈ విషయాన్ని తెలుసుకోలేని తీన్మార్ మల్లన్న తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకుంటున్నారు. తెలంగాణ లో జరిగిన బీసీ కుల సంఘాల సదస్సులో పాల్గొన్న మల్లన్న కులాల ఆధారంగా చేసిన కొన్ని వ్యాక్యలు ఇప్పుడుసోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

2015 నుంచి రాజకీయంగా నిలదొక్కుకోవడానికి అలుపెరుగని పోరాటం చేసిన తీన్మార్ మల్లన్న చిట్ట చివరికి 2024 ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే ఆ వచ్చిన ఒక్క విజయం ఇక తన రాజకీయ జీవితానికి చాలు అనుకున్నారో ఏమో కానీ., ఒకవేళ వచ్చే ఎన్నికలలో నేను పోటీలో నిలబడితే నాకు రెడ్లు…ఓసీలు ఓటు వేయొద్దని, తనకు కేవలం బీసీల ఓట్లు సరిపోతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

తన గెలుపుకి బీసీల ఓట్లు సరిపోతాయని ఒకరకంగా చెప్పాలంటే ఆ బీసీల ఓట్లే తనకు ఇంకా మిగిలిపోతాయంటూ వ్యాఖ్యానించారు. అలాగే తనకు రెడ్డి, ఓసీల ఓట్లు అవసరం లేదని తెగేసి చెప్పేసారు. దీనితో మల్లన్న వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది.

ఈ విషయం తానూ ఎమ్మెల్సీ గా పోటీ చేసే సమయంలో చెపితే బాగుండేదని, ఇప్పుడు గెలిచిన తరువాత ఆ కులం ఓట్లు నాకు అక్కర్లేదు అంటూ వ్యాఖ్యానించడం సరికాదు అంటూ మల్లన్న వ్యాఖ్యలు మీద విమర్శలు వెల్లువెత్తున్తున్నాయి.

ఇదంతా అవసరం తీరాక తెప్ప తగలేసే రకం మాదిరి కనపడుతుందని, ఇప్పుడు ఎమ్మెల్సీ గా గెలిచిన మల్లన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరల ఎలక్షన్స్ వెళ్లి తనకు కేవలం బీసీల ఓట్లు మాత్రమే కావాలని అడిగి గెలిచి చూపించాలంటూ మండిపడుతున్నారు ఆ వర్గం ఓటర్లు.

అసలు రాజకీయాలలో కులాల ఆధారంగా రాజకీయం చెయ్యడమే తప్పు అని భావిస్తున్న వేళ ఈయన గారు ఏకంగా ఈ కులం ఓట్లు వద్దు ఆ కులం ఓట్లే ముద్దు అంటూ బహిరంగ ప్రకటనలు చెయ్యడం ఆయన అహంకారానికి నిదర్శనమా.? లేక అది ఆయన గారి అవివేకానికి పరాకాష్టా.? అంటూ తీన్మార్ మల్లన్న మీద ఆయా సామజిక వర్గాల వారు మండిపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories