ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ కరుణాకరన్. పవర్ స్టార్ ‘తొలిప్రేమ’తో ఘనంగా ఆరంభమైన కెరీర్ లో ఇటీవల పరాజయాలు చవిచూసినప్పటికీ, కరుణాకరన్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఆసక్తి ఉంది. ముఖ్యంగా లవ్ స్టోరీలను డీల్ చేయడంలో దిట్టగా కరుణాకరన్ ఖ్యాతి గాంచాడు. తాజాగా సాయిధరమ్ తేజ్ తో కూడా ఓ ప్రేమకధనే సెట్ చేసాడు.
ఇటీవల ప్రీ లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్, తాజాగా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. “తేజ్” అనే టైటిల్ తో ‘ఐ లవ్ యూ’ అంటూ కాప్షన్ ను పెట్టి రిలీజ్ చేసిన పోస్టర్ లో సాయి – అనుపమల లుక్ ను చూపిస్తూ… మే 1వ తేదీన టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా స్పష్టం చేసారు. తేజ్ కెరీర్ కు కూడా ఈ “తేజ్” సినిమా చాలా కీలకంగా మారింది.
ADVERTISEMENT
ADVERTISEMENT



