టీజర్ టాక్ – డైరెక్టర్ మార్క్!

Tej I Love You Teaser Talkదర్శకుడిగా కరుణాకరన్ కంటూ ఓ మార్క్ ఉంది. ముఖ్యంగా లవ్ సీన్స్ ను చిత్రీకరించడంలో తనకు తానే సాటి అనిపించే విధంగా అందమైన దృశ్యకావ్యంగా మలచడంలో ఈ తమిళ దర్శకుడు దిట్ట. అలాంటి కరుణాకరన్ నుండి తాజాగా రాబోతున్న సినిమా “తేజ్ ఐ లవ్ యూ.’ మెగా హీరో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ను ఇటీవలే రివీల్ చేయగా, తాజాగా ఫస్ట్ టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ADVERTISEMENT

కధకు సంబంధించి ఏమీ రివీల్ చేయలేదు గానీ, ఈ లవ్ సీన్ ను లవ్లీగా చిత్రీకరించడంలో కరుణాకరన్ మార్క్ స్పష్టంగా కనపడుతోంది. హీరో సాయిధరమ్ టీ తాగుతూ హీరోయిన్ అనుపమ గురించి ఊహించుకునే సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించాడు. సీన్ ఏమీ కొత్తగా లేకపోయినా, మాస్ సినిమాలు చేసిన సాయికి ఇలాంటి సీన్స్ ఫ్రెష్ లుక్ ను పంచుతాయని చెప్పడంలో సందేహం లేదు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ సమ్మర్ లోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories