mirai-telugu-glimpse--teja-sajja-karthik-gattamneni

ఇండస్ట్రీ లో ఆరోగ్యకరమైన ఎదుగుదల జరగాలంటే పెద్ద సినిమాల విజయంతో పాటు చిన్న సినిమాల మనుగడ కూడా తప్పనిసరనేది ఇండస్ట్రీ పెద్దల అభిప్రాయం. ఇప్పుడు ఇదే అంశం పైన ద్రుష్టి పెట్టారు యువ నటీనటులు, దర్శకులు.

దీనికి చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కలయికలో వచ్చిన హనుమాన్. చిన్న సినిమాగా ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చి స్టార్ హీరోల సినిమాలకు బాక్స్ ఆఫీస్ సౌండ్ ను పెద్దగా వినిపించేలా చేసింది ఈ హనుమాన్. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో వచ్చిన హనుమాన్ అటు విజువల్ గాను ఇటు వసూళ్లలోనూ పెద్ద సినిమా స్థాయిని తలపించింది అనడంలో ఏమాత్రం సంశయం లేదనే చెప్పాలి.

Also Read – వైసీపీ శపధాలే శాపాలయ్యాయా.?

అలాగే విద్యాధర్ కాగిత దర్శకత్వంలో వచ్చిన విశ్వక్ సేన్ ‘గామి’ మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టెక్నికల్ గా చిన్న సినిమా స్థాయిని గామి అధిగమించింది అనే మంచి పేరును సాధించుకున్నారు దర్శకుడు విద్యాధర్. కొత్త కథలతో, వినూత్న కథనాలతో ప్రేక్షకులను మెప్పించడంలో చిన్న సినిమాలు పెద్ద విజయాలను సాధించగలవని ఈ సినిమాలు నిరూపించాయి.

అప్పట్లో వచ్చిన నిఖిల్ కార్తికేయ మూవీ కూడా ఈ కోవకు చెందినదే. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో 100 కోట్లకు మించి వసూళ్లను సాధించి చిన్న సినిమా స్థాయికి ఒక బెంచ్ మార్క్ సృష్టించింది. ఈ రికార్డులను హనుమాన్ తో బద్దలుకొట్టి చిన్న సినిమా స్థాయిని 300 కోట్లకు చేర్చారు. అలాగే త్వరలో రాబోతున్న తేజ, కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ మూవీ కూడా ఇటువంటి అంచనాలనే సృష్టించింది.

Also Read – నోటి దూల ఫలితం అనుభవించాలిగా..!

మిరాయ్ గ్లిమ్స్ తో తేజ మరో హనుమాన్ మాదిరి హిట్ అందుకోబోతున్నారా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మిరాయ్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతుంది అనేది మూవీ గ్లిమ్స్ చూసి అంచనా వేయవచ్చు అంటున్నారు సినీ వర్గాలు. అలాగే అడవి శేషు టేకింగ్ స్టైల్ కూడా చిన్న సినిమాల స్థాయిని పెంచిందనే చెప్పాలి.అయితే కామెడీ అండ్ కమర్షిల్ మూవీ గా వచ్చిన శ్రీ విష్ణు సామజవరగమన, MAD , సిద్దు డీజే టిల్లు మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు సృష్టించాయి.




Also Read – పుష్ప పై క్రెజే కాదు రూమర్లు తగ్గట్లా..!