అధికారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ రెండు యాత్రలు

Telagana BJP President bandi sanjay kumar plans bus yatra
ఇటీవలే జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ తో తెలంగాణ బీజేపీ మరిన్ని మెరుగైన ఫలితాలు రాబట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక, వరంగల్ – ఖమ్మం మునిసిపల్ ఎన్నికల దృష్ట్యా మరింతగా ప్రజల వద్దకు వెళ్ళాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయించుకున్నారు.

బీజేపీ… త్వ‌ర‌లో పాద‌యాత్ర‌కు రెడీ అవుతుంది. మొద‌టగా బ‌స్సు యాత్ర చేప‌ట్టి 33 జిల్లా కేంద్రాల‌ను చుట్టి రావాలని ప్లాన్ చేస్తుంది. ఈ బ‌స్సు యాత్ర‌లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రుల వంటి వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ADVERTISEMENT

బ‌స్సుయాత్ర‌లో ఇటీవలే పార్టీలో చేరిన విజ‌య‌శాంతిని హైలైట్ చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత ద్వితీయ శ్రేణి క్యాడ‌ర్ పెంచుకుని ప్ర‌జా స‌మ‌స్య‌ల పై పోరాడటమే ల‌క్ష్యంగా పాద‌యాత్ర‌కు ప్లాన్ చేస్తున్నారు. బండి సంజ‌య్ తెలంగాణ ఉద్య‌మ హామీలు, తెరాస పాల‌న‌లో నెర‌వేర్చిన అంశాలను ప్రస్తావిస్తూ పాద‌యాత్ర సాగించ‌నున్నారు.

ఈ రెండు యాత్ర‌ల‌తో గ్రామ‌స్థాయి వ‌ర‌కు పార్టీ బ‌లోపేతం కావ‌టంతో పాటు తెరాస కు ప్ర‌త్యామ్నాయంగా నిలవాలని ఆలోచ‌నతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాకరాక వచ్చిన ప్రజా మద్దతును ఉపయోగించుకుని తెలంగాణలో బలీయమైన శక్తిగా మారాలని బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తుంది.

ADVERTISEMENT
Latest Stories