ఫోన్ ట్యాపింగ్ కేసు.. అంతం కాదిది ఆరంభం

KCR and KTR phone tapping case

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కొన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయని ఇటీవలే సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. వాటితో రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని అనూహ్యమైన మార్పులు కలుగుతాయని కూడా అప్పుడే చెప్పారు.

ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తుది అదనపు ఛార్జిషీట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దానిలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఏ1గా, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ2గా పేర్కొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరితో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కె. నవీన్‌రావుల పేర్లు కూడా ఛార్జిషీట్‌లో ఉండవచ్చని సమాచారం.

ADVERTISEMENT

ఫోన్ ట్యాపింగ్ కేసులో తమపై వస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమపై రాజకీయ కక్షతోనే ఈ పేరుతో కేసులు నమోదు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు.

అయితే ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్‌ కోర్టు విచారణకు అవసరమైన బలమైన సాక్ష్యాధారాలు సేకరించింది. ఆ ఆధారాలతో ఒకవేళ కోర్టులో నేరాన్ని నిరూపించగలిగితే సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పినట్లు రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉంది.

నాడు రేవంత్ రెడ్డి ఎప్పటికైనా కేసీఆర్‌ని జైలుకు పంపించి జైల్లో చిప్పకూడు తినిపిస్తానని శపథం చేశారు. కనుక ఈ కేసులో ఆయన అరెస్ట్ అయితే ఆ శపథం నెరవేరుతుంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో ఇంతకంటే తీవ్రమైన, ఖచ్చితంగా నేరం నిరూపించగల కేసుల్లోనూ నిందితులు ఫుట్‌బాల్ ఆడుకుంటూ ఏళ్ల తరబడి శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. కనుక ఈ కేసులో కేసీఆర్‌ తదితరులను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం, ఆ తర్వాత వారు బెయిల్‌పై బయటకు రావడం ఖాయమే. కనుక ఈ కేసుకు కూడా ప్రారంభమే ఉంటుంది కానీ ముగింపు ఉండకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories