‘పెన్ డ్రైవ్’ కోసం ‘సినీ నటి’ పోలీస్ కేసు!

USB drive caseఇటీవల కాలంలో సినీ ప్రేమ వ్యవహారాలు ఎలా దారి తప్పుతున్నాయో మీడియాల వేదికగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ కోవలోనే మరో ఉదంతం బయటకు వచ్చింది. హైదరాబాద్, ఫిలింనగర్ లో నివసించే సినీ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాధా ప్రశాంతికి దిల్ షుఖ్ నగర్ కు చెందిన ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ జగదీష్ రెండు వారాల క్రితం పరిచయమవడం, అది కాస్త స్నేహంగా మారడం వడివడిగా జరిగిపోయాయి.

తీరా అక్కడ నుండి సీన్ కట్ చేస్తే… వారం రోజులుగా జగదీష్ కనపడకుండా పోయాడని, మూడు రోజుల క్రితం జూబ్లిహిల్స్ పోలీసులను రాధా ప్రశాంతి ఆశ్రయించింది. అలాగే తన పెన్ డ్రైవ్ పోయిందని, దానిని జగదీశ్ దొంగిలించాడని కూడా ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, నలుగురు క్రైం పోలీసులతో ఓ టీంను ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT

మూడు రోజుల పాటు జగదీష్ ఇంటి వద్ద రేయింబవళ్లు కాపలా కాసిన పోలీసులు ఎట్టకేలకు ఆయనను పట్టుకుని పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు. తీరా సినిమాలో ట్విస్ట్ ఏమిటంటే… అసలు ఆ పెన్ డ్రైవ్ సంగతి తనకు తెలియదని, తాను దొంగిలించలేదని జగదీష్ స్పష్టం చేయడంతో అవాక్కయ్యే పరిస్థితి పోలీసుల వంతయ్యింది.

ADVERTISEMENT
Latest Stories