తమిళ నటుడు, నిర్మాత అయినటువంటి ఇళయరాజాపై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించానంటూ వెంటపడి రెండేళ్ళ క్రితం తనను పెళ్ళి చేసుకున్నాడని, ఇప్పుడు మరో యువతితో పెళ్ళికి సిద్ధపడ్డాడని ఇళయరాజాపై హేమ ఆరోపణలు గుప్పించింది.
వరంగల్ జిల్లాకు చెందిన హేమ పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో ఇళయరాజాతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడం, ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకుని వైవాహిక జీవితం సాగిస్తున్నట్లుగా హేమ చెప్పుకొచ్చింది.
ఇటీవల ఇళయరాజా సోదరుడి పెళ్ళి కుదిరిందని, ఇప్పుడు పెళ్ళి కుమార్తె చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటానంటూ తనకు ఇళయరాజా ముఖం చాటేస్తున్నాడని హేమ ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోయిన హేమ, ఇళయరాజా బంధువు పోలీసు అధికారి అని, వారికి రాజకీయ అండదండలు కూడా వుండడంతో పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని పేర్కొంది.



