సినిమా ఇండస్ట్రీలో ‘ఎఫైర్లు’ కామనే కదా!

Regina affair talkబాలీవుడ్ లో ‘లిప్ లాక్ హీరో’గా ఇమ్రాన్ హష్మి ఏ విధంగా అయితే ఖ్యాతి పొందారో, టాలీవుడ్ లో ‘లిప్ లాక్ హీరోయిన్’గా రెజీనా పేరు తెచ్చుకుంది. దీనికి తోడు ఓ హీరోతో ఎఫైర్ ఉందన్న వార్తలతో ఇటీవల కాలంలో రెజీనా పేరు హాట్ హాట్ గా మారింది. తాజాగా ఈ భామ నటించిన “సౌఖ్యం” సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కానున్న నేపధ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పలు ఇంటర్వ్యూ లు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

‘సౌఖ్యం’ సినిమా విశేషాలతో పాటు, తనపై వచ్చిన ‘ఎఫైర్ల’పై కూడా స్పందించిన రెజీనా… “పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో తరహాలోనే ‘సౌఖ్యం’ సినిమాలో నా పాత్ర అయిన శైలజ ఉంటుందని, అయితే ఈ సినిమాలో ఎక్కువ డ్యాన్స్ లు వేశానని, హీరో గోపీచంద్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అని, దర్శకుడు రవి కుమార్ చౌదరితో ఇప్పటికే ఒక సినిమా చేశాను గనుక చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT

ఇక, ఎఫైర్ల గురించి వ్యాఖ్యానిస్తూ… తానూ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళల్లో ఎఫైర్లకు దూరంగా ఉన్నానని కితాబిచ్చారని, ఇపుడేమో రూమర్స్ వస్తున్నాయని, సినీ ఇండస్ట్రీలో రూమర్లు చాలా సర్వ సాధారణమేనని, అయితే వాటికి తానూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వబోనని, ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ పైనే ఉందని, కెరీర్ తొలినాళ్ళల్లో కమర్షియల్ సినిమాలకు పనికి రావన్నారని, అయితే ప్రస్తుతం కమర్షియల్ చిత్రాలే చేస్తున్నానని, తెలుగులో మరిన్ని మంచి చిత్రాలు చేయడమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చింది రెజీనా.

ADVERTISEMENT
Latest Stories